నెరవేరిన రేవంత్ పంతం - కేసీఆర్ ఫిక్స్, అక్కడే ట్విస్ట్..!!

తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య వ్యూహా లు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి పైన రేవంత్ తొలి నుంచి గులాబీ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత విచారణకు కమిషన్ ఏర్పాటు చేసారు. ఎట్టకేలకు కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరయ్యారు. కమిషన్ సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కమిషన్ ఎదుట కేసీఆర్ ను కూర్చోబెట్టటంలో రేవంత్ సక్సెస్ అయితే.. ఇప్పుడు కేసీఆర్ వ్యవహారంలో ఏం జరుగుతుందనేది కీలకంగా మారుతోంది.

50 నిమిషాల విచారణ
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ ముగిసింది. కాళేశ్వ‌రం క‌మిష‌న్ చైర్మ‌న్ జ‌స్టిస్ పీసీ ఘోష్.. కేసీఆర్‌ను 50 నిమిషాల పాటు విచారించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాల‌పై క‌మిష‌న్‌కు కేసీఆర్ నివేదిక ఇచ్చారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ను కూడా క‌మిష‌న్‌కు కేసీఆర్ అంద‌జేశారు. క‌మిష‌న్ అడిగిన ప్ర‌తి ప్ర‌శ్న‌కు ఆధారాల‌తో స‌హ నివేదికను అం దించినట్లు సమాచారం. దైవసాక్షిగా వాస్తవాలు చెబుతానని కేసీఆర్ చేత కమిషన్ ఛైర్మన్ ప్రమా ణం చేయించారు. మొత్తం 18 ప్రశ్నలను ఘోష్ అడిగినట్లు తెలుస్తోంది. రీ ఇంజనీరింగ్, కార్పొరే షన్ ఏర్పాటు, కేబినెట్ ఆమోదంపై కమిషన్ ప్రశ్నలు వేసింది. రీ ఇంజనీరింగ్ చేయడానికి ప్రధాన కారణాలను కేసీఆర్ సుదీర్ఘంగా వివరించినట్లు సమాచారం.

former-cm-kcr-appears-before-kaleshwaram-commission-details-here

కేబినెట్ ఆమోదంతో
ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతీ నిర్ణయం కేబినెట్ ఆమోదంతో జరిగిందని కేసీఆర్ వివరణ ఇచ్చి నట్లు తెలుస్తోంది. కేబినెట్ ఆమోదంతోనే ప్రభుత్వం అన్ని నిర్ణయాలు తీసుకుందన్నారు. స్థల మార్పు నీటి లభ్యత, కాళేశ్వరం నిర్మాణంపై వ్యాప్కోస్ నివేదిక ఇచ్చిందని కమిషన్‌కు వివరించిన ట్లు సమాచారం. నిధుల సమీకరణ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశామని.. బ్యారేజీల్లో నీటి నిలువ అనేది ఇంజనీర్లు తీసుకునే నిర్ణయం తనకు సంబంధం లేదని కేసీఆర్ వెల్లడించారు. ప్రాజెక్టు లొకేషన్ ఎందుకు మార్చాల్సి వచ్చిందో కేసీఆర్ సుదీర్ఘంగా వివరించారు. సీడబ్ల్యూసీ తుమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత లేదని చెప్పిందని.. వ్యాప్కోస్ సర్వే చేసి నివేదిక ఇచ్చిందని వివరించారు. టెక్నికల్ టీం మూడు బ్యారేజీలు నిర్మించాలని చెప్పిందన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించలేదని చెప్పారు. టెక్నికల్ టీం ఇచ్చిన నివేదిక మేరకు లోకేషన్ మార్పు జరిగిందని కేసీఆర్ వెల్లడించినట్లు సమాచారం.

కీలక మలుపు
రాజకీయంగా కేసీఆర్ విచారణకు హాజరు కావటం కీలక మలుపుగా కనిపిస్తోంది. ఈ విచారణకు హాజరు విషయంలో కేసీఆర్ సమయం కోరటం మినహా.. వాయిదా వేయలేదు. రాజకీయంగా తన పైన వస్తున్న ఆరోపణలకు కమిషన్ విచారణకు హాజరైన సమాధానం ఇవ్వటం ద్వారా క్లీన్ చిట్ తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అటు సీఎం రేవంత్ కాళేశ్వరం పైన పూర్తి వివరాలు వెల్లడించేందుకు సిద్దం అవుతున్నారు. ఇటు గులాబీ పార్టీ నేతలు అసలు అవినీతికి ఆస్కారం లేదని వాదిస్తున్నారు. దీంతో.. ఇప్పుడు కమిషన్ విచారణ లో ఏం తేల్చే అవకాశం ఉంది.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+