మరో వివాదంలో మల్లారెడ్డి: నమ్మితే రూ. 14 కోట్లు ఎగ్గొట్టారంటూ వృద్ధ రైతు ఆవేదన

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరో భూ వివాదంలో చిక్కుకున్నారు. మల్లారెడ్డిపై ఓ రైతు సంచలన ఆరోపణలు చేశారు. దగ్గరి చుట్టమే కదా అని నమ్మితే.. మల్లారెడ్డి తనను నమ్మించి గొంతు కోశారని దోమలగూడకు చెందిన 87 ఏళ్ల వృద్ధ రైతు కళ్లెం నర్సింహా రెడ్డి మీడియా ముందు వాపోయారు. మల్లారెడ్డి నుంచి తనకు రావాల్సిన డబ్బులను ఇప్పించాలని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వేదికగా తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట మండలంలోని యాడారంలో సర్వే నంబర్ 249, 250లో తనకు 23.26 ఎకరాల భూమి ఉందన్నారు రైతు కళ్లెం నర్సింహారెడ్డి. అందులో 9.29 ఎకరాలను రూ.21.88 కోట్లకు కొనేందుకు తనతో మల్లారెడ్డి ఎంఓయూ చేసుకున్నట్లు చెప్పారు. అనంతరం విడతల వారీగా రూ.8.03 కోట్లు చెల్లించినట్లుగా తెలిపారు.

Former minister Mallareddy in another land dispute

ఇక, మిగతా రూ.14 కోట్లు తర్వాత ఇస్తానని నమ్మించి భూమిని సీఎంఆర్ ఇన్​‌ఫ్రా స్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుపై మల్లారెడ్డి జూన్‌​లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని నర్సింహారెడ్డి తెలిపారు. ఆ తర్వాత మిగిలిన రూ.14 కోట్లకు చెక్కులు ఇవ్వగా అవి బౌన్స్ అయినట్లుగా చెప్పారు. 40 రోజులుగా ఆ డబ్బులు అడిగితే మల్లారెడ్డి స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రావాల్సిన సొమ్మును ఎలాగైనా తనకు ఇప్పించేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు రైతు కళ్లెం నర్సింహారెడ్డి.

రూ.14 కోట్ల డబ్బు తనకు మల్లారెడ్డి ఇవ్వాల్సి ఉందన్నారు. తనలాంటి వృద్ధిడికి ఇలా మోసం చేయడం సమంజసం కాదని వాపోయారు. తాను సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్లాలనుకుంటున్నట్లు కళ్లెం నర్సింహారెడ్డి తెలిపారు. తనకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని కోరతానని చెప్పారు. కాగా, మాజీ మంత్రి మల్లారెడ్డి ఇప్పటికే పలు భూ వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+