నల్గొండ జిల్లా పోలీసుల అదుపులో కిడ్నీ రాకెట్ సూత్రధారులు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ ప్రధాన సూత్రదారులను నల్గొండ పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. గుజరాత్‌కు చెందిన సురేష్, ప్రజాపతితో పాటు మరో ఇద్దరిని ఈరోజు ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ముఠాకు సంబంధించిన వివరాలను నల్గొండ జిల్లా ఎస్పీ విక్రంజిత్ దుగ్గల్ మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ముఠా సుమారు 100 మందికి చెందిన కిడ్నీలను విక్రయించినట్లు ఆయన తెలిపారు. ఒక్కో కిడ్నీ రూ. 30 లక్షల చొప్పున ఇప్పటివరకు దాదాపు 60 కిడ్నీలు అమ్మారని తెలిపారు.

Four arrested in India over kidney selling racket in Nalgonda

దీంతో రూ. 3 కోట్ల ఆదాయాన్ని వచ్చిందని అనంతరం డబ్బును జల్సాలకు వినియోగించారని ఆయన పేర్కొన్నారు. శ్రీలంకలోని మూడు ప్రధాన ఆస్పత్రులకు కూడా కిడ్నీలను విక్రయించారని చెప్పారు. శ్రీలంకలోని కొలంబో నర్సింగ్ హోమ్‌కు చెందిన డాక్టర్ మాధవ, డాక్టర్ మౌనిక, డాక్టర్ సాధన, షేర్ హాస్పిటర్‌కు చెందిన డాక్టర్ జెన్నిఫర్, డాక్టర్ రోషిణి, ఐస్టోన్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ హబీబా శెట్టిలపై కూడా కేసు నమోదు చేశామన్నారు.

వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ వివరించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న నల్గొండ పోలీసులు మరింత సమాచారం రాబట్టేందుకు విచారిస్తున్నారు. గత కొంతకాలంగా సంచలనం సృష్టిస్తోన్న ఈ కిడ్నీ రాకెట్ ముఠా ఏజెంట్ డబ్బులు కోసం కట్టుకున్న భార్య కిడ్నీనే అమ్మేసిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+