రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
హైదరాబాద్: హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారి పైన ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల పరిధిలోని అంబడిపల్లి గ్రామం శోకసంద్రంగా మారింది. గ్రామానికి చెందిన కృష్ణయ్య, భార్య హైమావతి, కుమారుడు విష్ణు, కుమార్తె దివ్య సోమవారం కడ్తాల మండలం మైసిగండి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కృష్ణయ్య ఎప్పుడో వలసవెళ్లి సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ఉంటున్నా.. అతడి సోదరులు, తల్లిదండ్రులు స్వగ్రామంలోనే ఉన్నారు.












Click it and Unblock the Notifications