Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇండక్షన్ స్టవ్ లు, కుక్కర్లు ఉచిత పంపిణీ.. వారికి బంపర్ ఆఫర్!

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డి పల్లి గ్రామ ప్రజలకు శుభవార్త. ఈ గ్రామంలో ప్రజలకు వంట కోసం ఇండక్షన్ స్టవ్ లను, ప్రెషర్ కుక్కర్ లను ఉచితంగా పంపిణీ చేశారు. అసలు కొండారెడ్డిపల్లి గ్రామ ప్రజలకే ఈ అదృష్టం ఎందుకు వరించింది? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లి లో ఏం జరుగుతుంది? అనేది ప్రస్తుతం అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది.

ఈ కుకింగ్ పథకానికి నమూనా గ్రామంగా కొండారెడ్డిపల్లి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డి పల్లి గ్రామం కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ కుకింగ్ పథకానికి పైలెట్ ప్రాజెక్టుగా మారింది. ఈ కుకింగ్ పథకానికి ఈ గ్రామం ఒక నమూనా కేంద్రంగా మారింది.

Free distribution of induction stoves and cookers Bumper offer for CM Revanth native village

Take a Poll

వంట కోసం ఇండక్షన్ స్టవ్ ల, ప్రెషర్ కుక్కర్ల పంపిణీ
ఇక్కడ ప్రతి ఇంటికి ఉచితంగా సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు, వంట కోసం ఇండక్షన్ స్టవ్ లను, ప్రెషర్ కుక్కర్ లను పంపిణీ చేశారు. గ్యాస్ సిలిండర్ల వినియోగాన్ని తగ్గించి, విద్యుత్ ఆధారిత ఇండక్షన్ స్టవ్ ల వాడకాన్ని ప్రోత్సహించడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న రెడ్కో, ప్రజలలో ఉన్న అపోహలను తొలగించడం కోసం చురుగ్గా కృషి చేస్తుంది.

ఇళ్ళపై సోలార్ ప్యానెల్స్, పునరుత్పాదక విద్యుత్ వినియోగం
ఇంటిపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఉచిత విద్యుత్ లభిస్తుంది కాబట్టి ఇండక్షన్ స్టవ్ లను వాడటం వల్ల విద్యుత్ బిల్లులు పెరగవని అక్కడి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. పునరుత్పాదక ఇంధనాన్ని ఉపయోగించి వంట చేయడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు ఆర్థిక భారాన్ని కూడా తగ్గించవచ్చని చెబుతోంది .

ఇంధన పరిరక్షణ నిధి నుండి వచ్చిన వడ్డీతో చర్యలు
అయితే గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంధన పరిరక్షణ కార్యక్రమాలను చేపట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 6కోట్ల నిధితో రాష్ట్ర ఇంధన పరిరక్షణ నిధిని ఏర్పాటు చేశాయి. ఇక ఈ నిధిని వినియోగించకుండా అలాగే ఉంచడంతో దానిపైన మంచి వడ్డీ కూడా వచ్చింది. కేంద్రం ఈ నిధిని ఉపయోగించకపోతే తిరిగి వెనక్కి తీసుకుంటామని హెచ్చరించడంతో రాష్ట్ర విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది.

ఇండక్షన్ స్టవ్ లు, కుక్కర్ లు ఉచిత పంపిణీ అందుకే
ఇందులో భాగంగా ఈ నిధిపైన వచ్చిన వడ్డీని మాత్రమే ఉపయోగించి ఇండక్షన్ స్టవ్ లు, కుక్కర్ లను కొనుగోలు చేసి కొండారెడ్డిపల్లి లోని మహిళలకు ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఇందులో భాగంగా 1300 మెగావాట్ల సామర్థ్యం గల ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్, ఐదు లీటర్ల సామర్థ్యం గల ప్రత్యేక కుక్కర్ ను అందిస్తున్నారు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వ పథకంతో సీఎం సొంత గ్రామంలో ప్రజల సౌర విద్యుత్ ను ఉత్పత్తి చేయడంతో పాటు, పునరుత్పాదక ఇంధనాన్ని ఉపయోగించి వంట చేయడానికి రెడీ అయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+