తెలంగాణలో అయోధ్యకు ఉచితంగా రైళ్లు.. ఎక్కడెక్కడి నుంచి అంటే..!
రామో విగ్రహవాన్ ధర్మ:... ధర్మానికి మనిషి రూపం ఏర్పడితే అది రాముడిలానే ఉంటుంది. అంతటి ధర్మస్వరూపుడు శ్రీరాముడు. ఆ రఘురాముడి సొంత ఊరు అయోధ్యలో దాదాపు 500 సంవత్సరాల తర్వాత అన్ని అడ్డంకులను దాటుకొని బాలరాముడు సింహాసనాన్ని అధిష్టించాడు. రామ్ లల్లా విగ్రహావిష్కరణ, ప్రాణప్రతిష్టను దేశమంతా చూసి పులకించిపోయింది. ఈనెల 23వ తేదీ నుంచి రామ్ లల్లా సాధారణ భక్తులకు కూడా దర్శనమివ్వనున్నాడు. ఇటువంటి తరుణంలో భారతీయ జనతాపార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలోని లోక్ సభ నియోజకవర్గాలవారీగా, వాటికి అనుబంధంగా ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భక్తులను ఉచితంగా అయోధ్యకు తీసుకువెళ్లనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 200 మంది చొప్పున ప్రత్యేక రైళ్లల్లో తీసుకువెళ్లనున్నారు. ఒక్కో రైలుకు 20 బోగీలుంటాయి. ప్రతి బోగీకి ఒక ఇన్ ఛార్జి ఉంటారు. వెళ్లిరావడానికి, అక్కడ ఉండటానికి కలిపి ఐదురోజుల సమయం పడుతుందని బీజేపీ నాయకులు వెల్లడించారు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15వరకు 17రోజులపాటు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.

నియోజకవర్గాలవారీగా ప్రత్యేక రైళ్ల షెడ్యూల్
సికింద్రాబాద్ నియోజకవర్గం - జనవరి 29 వ తేదీ
వరంగల్ నియోజకవర్గం - జనవరి 30వ తేదీ
హైదరాబాద్- జనవరి 31
కరీంనగర్- ఫిబ్రవరి 1
మల్కాజిగిరి- ఫిబ్రవరి 2
ఖమ్మం- ఫిబ్రవరి 3
చేవెళ్ల- ఫిబ్రవరి 5
పెద్దపల్లి- ఫిబ్రవరి 6
నిజామాబాద్- ఫిబ్రవరి 7
ఆదిలాబాద్- ఫిబ్రవరి 8
మహబూబ్ నగర్- ఫిబ్రవరి 9
మహబూబాబాద్- ఫిబ్రవరి 10
మెదక్- ఫిబ్రవరి 11
భువనగిరి- ఫిబ్రవరి 12
నాగర్ కర్నూల్- ఫిబ్రవరి 13
నల్గొండ- ఫిబ్రవరి 14
జహీరాబాద్- ఫిబ్రవరి 15
ఈ రైళ్లన్నీ కాజీపేట, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి బయలుదేరనున్నాయి. సికింద్రాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, మల్కాజిగిరి, మెదక్ లోక్ సభ నియోజకవర్గాలకు చెందిన భక్తులు సికింద్రాబాద్ లో రైలు ఎక్కాలి. నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్, తదితర నియోజకవర్గాలకు చెందిన భక్తులు కాజీపేట స్టేషన్‌లో రైలు ఎక్కాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications