High Court: గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు..
జొగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి హైకోర్టు కోర్టు షాకిచ్చింది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ ఆయనను అనర్హుడిగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రకటించింది. కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని హైకోర్టు ఆతనిపై వేటు వేసింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. అలాగే కృష్ణమోహన్ రెడ్డికి రూ.3 లక్షలు జరిమానా విధించింది. రూ.3 లక్షల్లో రూ.50 వేలు డీకే అరుణకు ఇవ్వాలని స్పష్టం చేసింది.
కొద్ది రోజుల క్రితం కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుపై కూడా హైకోర్టు అనర్హత వేటు వేసింది. 2018 ఎన్నికల్లో వనమా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. వెంకటేశ్వరరావుకు 81,118 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావుకు 76,979 ఓట్లు వచ్చాయి. వెంకటేశ్వర రావు 4 వేలు పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. అయితే వనమా వెంకటేశ్వర రావు ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని జలగం 2019లో కోర్టుకు వెళ్లారు.

విచారణ చేపట్టిన కోర్టు వనమా వెంకటేశ్వర రావు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినట్లు తేల్చింది. దీంతో వనమాపై అనర్హత వేటు వేసింది. ఆయన ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదని కొద్ది రోజులు క్రితం తీర్పు చెప్పింది. అయితే హైకోర్టు తీర్పుపై వనమా వెంకటేశ్వర రావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
పలువురు ఎమ్మెల్యేలపై కూడా ఎన్నికలకు సంబంధించి కోర్టుల్లో కేసులు ఉన్నాయి. వాటి తీర్పులు కూడా రావాల్సి ఉంది. హైకోర్టు తీర్పుపై కృష్ణమోహన్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications