గాంధీ,ఉస్మానియా పని తీరు మెరుగుపడాలి.!పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న హరీష్ రావు.!

హైదరాబాద్ : నగరంలోని ఆసుపత్రులు పటిష్టంగాపనిచేయాలని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను దూరం చేసి, ప్రభుత్వ ఆసుపత్రుల వైపు ప్రజల దృష్టి మరల్చే విధంగా గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల పనితీరు ఉండాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, అన్ని విభాగాధిపతులతో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

బ్రాండ్ మరింత పెంచండి.. గాంధీ,ఉస్మానియాపై మంత్రి హరీష్ సమీక్ష

బ్రాండ్ మరింత పెంచండి.. గాంధీ,ఉస్మానియాపై మంత్రి హరీష్ సమీక్ష

మంత్రి హరీష్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో డిఎంఇ రమేష్ రెడ్డి, టీఆస్ఎమ్సీఐడిసీ ఎండి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా విభాగాల వారీగా పనితీరు గురించి మంత్రి హరీష్ రావు సమీక్షించారు. గత సమీక్షలో తీసుకున్న నిర్ణయాల అమలు, పురోగతిపై ఆరా తీశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నారన్నారు మంత్రి హరీష్ రావు.

ఆరోగ్యశ్రీ అయుష్మాన్ భారత్ చికిత్సలు పెరగాలి.. కరోనా బాధిత గర్భిణులకు గాంధీలో సేవలు భేష్ అన్న హరీష్

ఆరోగ్యశ్రీ అయుష్మాన్ భారత్ చికిత్సలు పెరగాలి.. కరోనా బాధిత గర్భిణులకు గాంధీలో సేవలు భేష్ అన్న హరీష్

అంతే కాకుండా విలువైన వైద్య పరికరాలు సమకూర్చుకోవడం, ఔషధాల కొరత లేకుండా చూసుకోవడంతో పాటు..అవసరమైనన్ని నిధులను ప్రభుత్వం ఇస్తున్నదని మంత్రి చెప్పారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులపై నమ్మకం మరింత పెరిగేలా సేవలందించాలని సూచించారు. చికిత్స విషయంలో కార్పొరేట్ ఆసుపత్రులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నామని, పేషెంట్లతో ఆప్యాయంగా ఉంటూ వైద్య సేవలు అందిస్తే మరింత మంచి పేరు వస్తుందన్నారు. సిబ్బంది కూడా రోగులు, అటెండర్లతో మర్యాదగా వ్యవహరించాలన్నారు హరీష్ రావు.

స్నేహపూర్వక వాతావరణం పెరగాలి.. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల అపోహలు పోవాలన్న హరీష్

స్నేహపూర్వక వాతావరణం పెరగాలి.. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల అపోహలు పోవాలన్న హరీష్

పేషంట్లను హెచ్ వోడీలు పలకరిస్తూ, ఆరోగ్య సేవలు ఎలా అందుతున్నాయి అని తెలుసుకోవాలన్నారు. రోగులకు అన్ని వేళల్లో అత్యవసర వైద్య సేవలు అందాలని, ఆరోగ్య శ్రీ -ఆయుష్మాన్ భారత్ కేసులు మరింత పెరగాలన్నారు. ఇతర రాష్ట్రాల వారికి సైతం ఈ పథకంలో భాగంగా చిక్సితలు అందేలా చూడాలన్నారు. కిడ్నీ, మోకాలు, తుంటి ఎముకల మార్పిడి సర్జరీలు పెరగాలన్నారు. కరోనా బాధిత గర్భిణీలకు వైద్య సేవలు అందించిన గాంధీ గైనిక్ డిపార్ట్మెంట్ ను మంత్రి అభినందించారు.

మాతా శిశు మరణాలు తగ్గించాలి.. కేసీఆర్ కిట్స్ వెంటనే అందించాలన్న మంత్రి హరీష్ రావు

మాతా శిశు మరణాలు తగ్గించాలి.. కేసీఆర్ కిట్స్ వెంటనే అందించాలన్న మంత్రి హరీష్ రావు

అంతే కాకుండా సీ సెక్షన్‌ డెలివరీలు తగ్గించి, నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే రీతిలో మాతా, శిశు మరణాలు పూర్తిగా తగ్గించాలన్నారు. డెలివరీ జరిగిన వెంటనే కేసీఆర్ కిట్స్ అందించాలన్నారు. మాతా, శిశు మరణాలు, సాధారణ మరణాలు, సి సెక్షన్లపై ఆడిటింగ్ రిపోర్ట్ సిద్దం చేయాలన్నారు. సివిల్ వర్క్స్ పనులను రెండు ఆసుపత్రుల్లో వెంటనే పూర్తి చేయాలన్నారు. ఉస్మానియాలో కొత్త మార్చురీ 9 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నెలవారీ సమీక్ష ఉంటుందని, విభాగాల వారీగా రిపోర్టులతో సిద్దంగా ఉండాలన్నారు. పని చేసేవారికి తప్పక ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు మంత్రి హరీష్ రావు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+