కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ .. రేవంత్ రెడ్డితో భేటీ అయిన బీజేపీ, టీఆర్ఎస్ కీలక నేతలు .. త్వరలో కాంగ్రెస్ గూటికి !

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి కి తెలంగాణ రథసారథిగా బాధ్యతలు అప్పజెప్పడంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చాలా మంది మొగ్గు చూపిస్తున్నారా? అన్ని జిల్లాలలోనూ గతంలో కీలకంగా పని చేసి, ఇప్పుడు వివిధ పార్టీలలో ప్రాధాన్యతను కోల్పోయిన నేతలు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని చూస్తున్నారా? రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు చూపిస్తుందని అందరూ భావిస్తున్నారా? రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చెయ్యటం కోసం ఆపరేషన్ ఆకర్ష్ అంటున్నారా ? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కావటంతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం

రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కావటంతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం

తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటినుండి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొంది. జిల్లాల వారీగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు కథనోత్సాహంతో ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై నిరసన కార్యక్రమం అందుకు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. అన్ని జిల్లాలలోనూ భారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి ఆందోళన కార్యక్రమాలు అంటే నామమాత్రంగా సాగేవి. కానీ రేవంత్ రెడ్డి సారథ్యంలో మంచి జోష్ తో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి దిగారు.

రేవంత్ రెడ్డి తో భేటీ అయిన ముగ్గురు కీలక నేతలు

రేవంత్ రెడ్డి తో భేటీ అయిన ముగ్గురు కీలక నేతలు

ఇదిలా ఉంటే వివిధ జిల్లాలలో అనేక కారణాలతో ప్రాధాన్యత కోల్పోయిన నేతలు, గతంలో కీలకంగా పార్టీలలో వ్యవహరించిన నాయకులు ఇప్పుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ముఖ్యంగా గతంలో టీడీపీలో కీలకంగా పనిచేసిన నాయకుల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూడడం ఆసక్తిని కలిగిస్తుంది. తాజాగా భూపాలపల్లి నియోజక వర్గానికి చెందిన గండ్ర సత్యనారాయణ , మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీజేపీ నేత ఎర్ర శేఖర్, నిజామాబాద్ జిల్లా మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీ లో చేరడానికి రెడీ అవుతున్నట్లు గా తెలుస్తుంది.

 పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్న నేతలు

పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్న నేతలు

గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసిన ఎర్ర శేఖర్, గండ్ర సత్యనారాయణ రావులు అలాగే ధర్మపురి సంజయ్ నేడు టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఎర్ర శేఖర్ బీజేపీ లోనూ,గండ్ర సత్యనారాయణ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయిన గండ్ర సత్యనారాయణ భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి బాధ్యతల విషయంలో ఆయనతో మాట్లాడినట్లుగా సమాచారం. ఇక ఆ బాధ్యత గండ్ర సత్యనారాయణకే ఇస్తానని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది.

 రేవంత్ రెడ్డి హయాంలో పార్టీ బలోపేతం అవుతుందని వెల్లడి

రేవంత్ రెడ్డి హయాంలో పార్టీ బలోపేతం అవుతుందని వెల్లడి

ఈ క్రమంలో భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన గండ్ర సత్యన్నారాయణ, ఎర్ర శేఖర్, ధర్మపురి సంజయ్ లు కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. ఈ మేరకు వారు స్పందించారు. త్వరలో రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరతామని ప్రకటించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు. త్వరలో బహిరంగ సభలు పెట్టి పార్టీలో చేరతామని వెల్లడించారు.

 రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో పెను మార్పులు ...ఆపరేషన్ ఆకర్ష్

రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో పెను మార్పులు ...ఆపరేషన్ ఆకర్ష్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారథి గా రేవంత్ రెడ్డికి బాధ్యతలను అప్పగించిన నాటినుండి తెలంగాణ రాజకీయ పరిణామాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పలువురు నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరాలని చూస్తున్నట్లుగా సమాచారం. ఇక రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అవుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో టీడీపీలో కీలకంగా పని చేసిన, ప్రస్తుతం ప్రాధాన్యతను కోల్పోయిన తెలంగాణ ప్రాంత నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా తాజా పరిణామాలతో స్పష్టంగా తెలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+