బాలాపూర్ లడ్డూకు రికార్డ్ ధర: రూ.16.60 లక్షలు, దక్కించుకున్న శ్రీనివాస్ గుప్తా
భాగ్యనగరంలో ఖైరతాబాద్ గణేషుడికి ఎంత ప్రాధాన్యత ఉందో బాలాపూర్ లడ్డూకు అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ రూ.16.60 లక్షలు పలికింది. గత ఏడాది కంటే లక్ష రూపాయలు ఎక్కువ పలికింది. ఇప్పటి వరకు ఇది రికార్డ్ ధర. ఈ లడ్డూను దక్కించుకున్నవారు శ్రీనివాస్ గుప్తా. ఆర్యవైశ్య సంఘం తరఫున దీనిని దక్కించుకున్నారు.
ఈ గణేషుడి లడ్డూను ఎవరు దక్కించుకుంటారోనని అందరూ ఎదురు చూస్తుంటారు. ఈ లడ్డూకు ఏటికి ఏడు క్రేజ్ పెరుగుతోంది. గత 25 ఏళ్లుగా ఈ లడ్డూను వేలం వేస్తున్నారు. 1994లో రూ.450 పలికిన లడ్డూ, గత ఏడాది (2017) రూ.15.60 లక్షలు పలికింది. ఈసారి గతం కంటే లక్ష ఎక్కువ పలికింది.

ఈ సంవత్సరం బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం కోసం డీడీ కట్టి రేసులో నిలిచిన వారు శ్రీనివాస్ రెడ్డి (ఆర్యవైశ్య సంఘం), పన్నాల కృష్ణారెడ్డి, కొలను రాంరెడ్డి, కుప్పిరెడ్డి విజయభాస్కర రెడ్డి, పోరెడ్డి తిరుమల్ రెడ్డి - ఎర్ర మహేశ్వరి, మన్నే బల్వంత్ రెడ్డి, భువనగిరి శ్రీనివాస్ బ్రదర్స్, లొక్క యాదిరెడ్డి, కళ్లెం ఎల్లారెడ్డి తదితరులు ఉన్నారు. చివరగా శ్రీనివాస్ రెడ్డి దక్కించుకున్నారు.



-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications