అర్ధరాత్రి అస్మన్‌గఢ్‌లో పేలుడు: నలుగురికి తీవ్ర గాయాలు, ఇంట్లో విధ్వంసం

హైదరాబాద్: నగరంలోని మలక్‌పేట అస్మన్‌ఘడ్‌లో శనివారం అర్ధరాత్రి సంభవించిన భారీ పేలుడుతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ఘటనతో ఆ ఇంట్లో భారీ విధ్వంసమే చోటు చేసుకుంది.

అస్మన్‌ఘడ్‌లోని మూడంతస్తుల భవనంలో భవన యజమానితోపాటు సెక్యూరిటీగార్డు అతని కుటుంబం నివసిస్తోంది. శనివారం అర్ధరాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డు
ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యింది. దీంతోపాటు ఫ్రిడ్జ్ నుంచి నిప్పు రవ్వలు చెలరేగడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.

 gas cylinder explosion at asmangadh in hyderabad: four injured

పేలుడు ధాటికి భవనం కిటికీ, తలుపుల అద్దాలు పగిలిపోయాయి. ఇంటి దగ్గర నిలిపివున్న కార్లు, ఇతర వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. పేలుడు జరిగిన భవనంకు సమీపంలోని అపార్ట్‌మెంట్ , ఇళ్ల కిటికీలు కూడా ధ్వంసమయ్యాయి. సెక్యూరిటీగార్డుతోపాటు అతని కుటుంబసభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.

పెద్ద ఎత్తున శబ్ధం రావడంతో ఏం జరిగిందో తెలియక స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను ఆర్పివేశారు. కాగా, వెంటిలేషన్ సరిగా లేని కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.

సరూర్‌నగర్‌లోనూ సిలిండర్ పేలిన ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయాలపాలయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+