శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్యాస్ లీకేజీ: తీవ్ర అస్వస్థతో ఒకరు మృతి, ఆస్పత్రిలో మరో ఇద్దరు
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం(రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం)లో గ్యాస్ పైప్ లీకైంది. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. నర్సింహా రెడ్డి అనే వ్యక్తి చికిత్స పొందుతూ మరణించారు.

ఆస్పత్రిలో మరో ఇద్దరు జాకీర్, ఇలియాస్ చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. గ్యాస్ లీకేజీ ఘటన ఒక్కసారిగా విమానాశ్రయంలో కలకలం రేపింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్యాస్ లీకేజీ: తీవ్ర అస్వస్థతో ఒకరు మృతి, ఆస్పత్రిలో మరో ఇద్దరు
— oneindiatelugu (@oneindiatelugu) June 17, 2021
#Hyderabad pic.twitter.com/Ii5NWruzsr


Click it and Unblock the Notifications