గజల్ శ్రీనివాస్ కేసు: ఏ2 పార్వతి ఎక్కడ అని ప్రశ్నించిన కోర్టు
హైదరాబాద్: గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసులో ఏ2 నిందితురాలు పార్వతిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని పంజుగుట్ట పోలీసులను నాంపల్లి కోర్టు ప్రశ్నించింది. గజల్ శ్రీనివాస్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పైన మంగళవారం నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది.
Recommended Video

గజల్ శ్రీనివాస్ ఏమయ్యాడు ?
గజల్ కేసులో ఇంకా చాలామందిని విచారించాల్సి ఉందని పోలీసులు చెప్పారు. కాబట్టి గజల్ శ్రీనివాస్‌కు బెయిల్ ఇవ్వవద్దని కోర్టుకు విన్నవించారు. ఈ మేరకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.

ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఏ2 నిందితురాలుగా ఉన్న పార్వతిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని పంజాగుట్ట పోలీసులను ప్రశ్నించింది. ఆమె పరారీలో ఉందని వారు చెప్పారు. మరోవైపు, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏ2 నిందితురాలు పార్వతి ముందస్తు బెయిల్ పిటషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications