జీహెచ్ఎంసీ ఎఫెక్ట్: హైదరాబాద్‌లో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటికి చిక్కు?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ)కి వచ్చిన రోడ్డు విస్తరణ ప్రతిపాదనతో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటికి గండం వచ్చేలా ఉందని అంటున్నారు.

ఇదీ మీ రిపోర్ట్: నేతల రిపోర్ట్ చదివిన బాబు, గంటాపై అసంతృప్తి, జగన్ వల్గర్‌గా..

జిహెచ్ఎంసి రోడ్ల విస్తరణలో భాగంగా జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి రోడ్డు నెంబర్ 45 వరకు రోడ్డు విస్తరణ చేపట్టేందుకు అనుమతించాలని కోరుతూ స్టాండింగ్ కమిటీ నుంచి జీహెచ్ఎంసీ కమిషనర్ ముందుకు ప్రతిపాదన వచ్చింది.

ఈ మధ్యలో ఉన్న భవనాలను, స్థలాలను భూసేకరణ ద్వారా తీసుకోవాలన్నది ప్రతిపాదన. ఈ ప్రతిపాదిత రోడ్డు విస్తరణ మార్గంలోనే హిందూపురం ఎమ్మెల్యే, టిడిపి నేత బాలకృష్ణ ఇల్లు ఉంది. ఈ మార్గంలో బాలకృష్ణ ఇల్లే ప్రధానమైనది.

GHMC affect on Balakrishna's Hyderabad house

మొదటగా ఈ ఇంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నివసించేవారు. ఆ తర్వాత బాలకృష్ణ వచ్చారు. ఇరవై ఏళ్లుగా బాలకృష్ణ ఈ ఇంట్లోనే ఉంటున్నారు.

ఈ ప్రతిపాదనకు పూర్తి స్థాయిలో అనుమతి లభిస్తే బాలకృష్ణ ఇంటితో పాటు ఆయన ఇంటి పక్కన ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్‌‌తో పాటు పలు రెస్టారెంట్‌లు కూడా మాయమవుతాయంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Hero and Hindupuram MLA Nandamuri Balakrishna residence may affected by GHMC recent proposal.
Please Wait while comments are loading...