తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుందని అమ్మాయిపై హత్యాయత్నం: యువతికి జైలు శిక్ష

హైదరాబాద్: తాను ప్రేమిస్తున్న యువకుడిని పెళ్లి చేసుకుందనే అక్కసుతో తన బంధువులపై అమ్మాయిని చంపడానికి ప్రయత్నించిన యువతికి న్యాయమూర్తి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 2 వేల రూపాయల జరిమానా వేశారు.

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట్ల గ్రామానికి పల్లకొండ మమత (27)కు వర్ధన్నపేట మండలం ఐలోను గ్రామానికి చెందిన పల్లకొండ దివ్యశ్రీ (23) సమీప బంధువు. 203 మార్చి 9వ తేదీన దివ్యశ్రీకి వరంగల్‌కు చెందిన కుమార్ (32)తో నిశ్చితార్థం జరిగింది. అదే ఏడాది జూన్ 13వ తేీదన పెళ్లికి ముహూర్తం పెట్టారు.

Girl sentenced to jail for attempt to murder

అయితే మమతకు అప్పటికే కుమార్‌తో ప్రేమవ్యవహారం నడుస్తోంది. దీంతో దివ్యశ్రీ అతన్ని పెళ్లి చేసుకోవడాన్ని తట్టుకోలేకపోయింది. దీంతో ఆమె దివ్యశ్రీని అడ్డం తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. కుమార్ ప్రవర్తన మంచిది కాదని, అతను మరో అమ్మాయిని ప్రేమించి హైదరాబాదులో పెళ్లి చేసుకుంటున్నాడని నమ్మించింది.

కావాలంటే చూపిస్తానంటూ ఆమెను 2013 మే 4వ తేదీన శ్రీకృష్ణానగర్‌లో నివసించే తన సోదరి స్వరూప ఇంటికి తీసుకుని వచ్ిచంది. కూరగాయలు కోసే కత్తితో ఆమెను విచక్షణారహితంగా పొడిచింది. తొమ్మిది చోట్ల గాయం చేసింది. దివ్యశ్రీ తన ఫోన్ ద్వారా కుమార్‌కు, తన తండ్రి సారయ్యకు విషయం తెలిపింది. దీంతో వారు సమీపంలోనే ఉంటున్న తమ బంధువులను సంఘటనా స్థలానికి పంపించి దివ్యశ్రీని ఆస్పత్రికి తరలించారు.

దాంతో మమతపై పోలీసులు కేసు నోదు చేశారు. కేసు రుజువు కావడంతో మమతకు న్యాయమూర్తి ఏదేళ్ల జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ మంగళవారంనాడు తీర్పు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+