ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు ఇప్పించండి: నిర్మలతో భట్టి విక్రమార్క

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం ఢిల్లీలో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించి సాయం చేయాలని కోరామని చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు ఇంకా రాలేదని, వాటిని వెంటనే ఇప్పించే విధంగా చూడాలని కోరినట్లు భట్టి విక్రమార్క తెలిపారు.

2014-15లో కేంద్ర ప్రభుత్వం పథకాలకు సంబంధించి.. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన మొత్తం నిధులను ఏపీ ఖాతాలోనే వేశారన్నారు. తెలంగాణ వాటా నిధులు తిరిగ ఇవ్వాలనికేంద్రమంత్రిని కోరినట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. 2019-20, 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం కేటాయించిన నిధులు రాష్ట్రానికి రాలేదని.. ఆ నిధులు కూడా వెంటనే విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు.

Give the fund dues to Telangana from AP Bhatti Vikramarka to Nirmala Sitharaman

వెంటనే స్పందించి పెండింగ్ అంశాలపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశామని భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చెప్పిన 8 అంశాలపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. త్వరలోనే కేంద్ర, రాష్ట్ర అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి పరిష్కార మార్గం చూపిస్తామని తెలిపారనని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రమంత్రి నిర్మలకు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏమన్నారంటే?

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ తోపాటు ఇతర అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఎన్ కన్వెన్షన్ కు నోటీసులు ఇచ్చిన తర్వాతనే కూల్చివేసినట్లు ఆయన చెప్పారు. ఈ వ్యవహారంలో తమ ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించిందని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు.

2014కు ముందు హైదరాబాద్ నగరంలో ఉన్న చెరువులు ఎన్ని.. ఇప్పుడు ఉన్న చెరువులు ఎన్నో చూస్తే ఆక్రమణలు బయటపడతాయన్నారు. రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ మ్యాపులతో అన్ని లెక్కలు బయటపెడతామని డిప్యటీ సీఎం భట్టి చెప్పారు. కబ్జా అయిన చెరువులను కాపాడవద్దని అంటారా? అని ఆయన ప్రశ్నించారు.

హైదరాబాద్ సిటీ అంటేనే లేక్స్ అండ్ రాక్స్. వీటిని కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారని చెప్పారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని డిప్యటీ సీఎం విక్రమార్క తెలిపారు. చెరువులు ఏవీ ఆక్రమణకు గురికాకుండా పరిరక్షించడం కోసం ఏర్పాటు చేసిందే హైడ్రా అని.. దీన్ని ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు. ప్రతి పనికి నోటీసులు ఇచ్చి ఆపై చర్యలు తీసుకొంటున్నారని డిప్యూటీ సీఎం విక్రమార్క వివరించారు.

రిమోట్ సెన్సింగ్ సాటిలైట్ ఫొటోలను తీసి, అంతకుముందు ఎన్ని చెరువులు ఉండేవి.. ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయనేది ప్రజల ముందు పెడతామని చెప్పారు డిప్యటీ సీఎం భట్టి. చట్ట ప్రకారం, చట్టానికి లోబడి మాత్రమే చర్యలు చేపడతున్నామననారు. అన్నీ లెక్కలతో సహా ప్రజల ముందు పెడతామని, ప్రజల ఆస్తులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+