నాలుగుకోట్లతో ఉడాయించిన బంగారం వ్యాపారి.. పెళ్లి నగలకోసం ఇచ్చామని లబోదిబోమన్న బాధితులు!!

నమ్మకంగా బంగారు నగలు చేసి ఇస్తాడని డబ్బులిస్తే ఆ డబ్బులు ఇచ్చిన వారితో పాటు, తనకు అప్పుగా ఇచ్చిన వారిని కూడా మోసం చేసి నాలుగు కోట్ల రూపాయలతో ఉడాయించాడు ఒక బంగారం వ్యాపారి. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో నాలుగు కోట్ల రూపాయలకు ప్రజలకు కుచ్చుటోపీ పెట్టిన బంగారం వ్యాపారి పై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇక బాధితులు చెబుతున్న వివరాల ప్రకారం..

అప్పుల భారం పెరిగి నాలుగు కోట్ల రూపాయలతో ఉడాయించిన బంగారం వ్యాపారి

అప్పుల భారం పెరిగి నాలుగు కోట్ల రూపాయలతో ఉడాయించిన బంగారం వ్యాపారి


వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో గత కొన్ని సంవత్సరాలుగా బంగారం వ్యాపారం నిర్వహిస్తున్నాడు ఒక వ్యాపారి. బంగారు ఆభరణాలను తయారుచేసి ఇస్తూ స్థానికంగా ఉన్న వారి నమ్మకాన్ని బాగానే సంపాదించాడు. ఇక ఆ తర్వాత తనకు ఏర్పడిన పరిచయాలతో కొంతమంది నుంచి రెండు కోట్ల యాభై లక్షల వరకూ వడ్డీకి అప్పు తీసుకున్నాడు. ఆ వడ్డీ కట్టడం, వడ్డీ తో పాటు అసలు భారం పెరిగి పోవడం అతనికి ఇబ్బంది గా మారాయి. కరోనా ప్రభావంతో ఆర్దికంగా ఇబ్బందుల్లో పడ్డాడు. ఇక ఆ ఇబ్బందుల నుండి కోలుకోలేదు. ఇదిలా ఉంటే బంగారు ఆభరణాలను తయారు చేయడం కోసం దుకాణానికి వచ్చిన కొందరు వినియోగదారులు అతనికి అడ్వాన్స్ గా 50 లక్షల రూపాయల వరకు డబ్బులు ఇచ్చారు. అప్పుల భారం పెరిగి పోవడంతో బంగారం వ్యాపారి మొత్తం నాలుగు కోట్ల రూపాయలతో నర్సంపేట నుండి ఉడాయించారు.

అప్పుల వాళ్ళ ఒత్తిడితో వ్యాపారి పరారీ

అప్పుల వాళ్ళ ఒత్తిడితో వ్యాపారి పరారీ

తక్కువ వడ్డీకి బంగారు ఆభరణాలు తనఖా పెట్టుకుని, అదే ఆభరణాలను ఎక్కువ వడ్డీకి, ఎక్కువ ధరకు వేరే వారి వద్ద తనఖా పెట్టి ఎక్కువ డబ్బులు తీసుకుంటూ ఆ డబ్బులతో బిజినెస్ చేశాడు. ఇక తన బిజినెస్ చేస్తున్న క్రమంలో కోటి రూపాయలతో ప్లాట్లు, నర్సంపేట పట్టణం లోని జయ లక్ష్మీ సెంటర్ లో ఒక షట్టర్ ను కొనుగోలు చేశాడు. దీంతో ఇటీవల తన అప్పుల భారం మరింత పెరగడంతో, అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి కూడా పెరిగిపోయింది. ఇక అప్పు ఇచ్చిన వారికి సమాధానం చెప్పలేక, తిరిగి వారు డబ్బులు మొత్తం కట్టలేక వారం రోజుల క్రితమే సదరు వ్యాపారి పరారయ్యాడు.

వివాహాలకు బంగారు ఆభరణాల ఆర్డర్లు .. వాపోయిన బాధితులు

వివాహాలకు బంగారు ఆభరణాల ఆర్డర్లు .. వాపోయిన బాధితులు


మొదట్లో ఏదైనా ఊరు వెళ్లి ఉంటాడు అని భావించినప్పటికీ, వారం రోజులుగా షాపు మూసి ఉండడంతో ఎంక్వైరీ చేసిన బాధితులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో నిన్న షాపు వద్దకు వచ్చి బాధితులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూతుళ్ల పెళ్లిళ్ల కోసం బంగారానికి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కూడా తీసుకొని వెళ్ళిపోయాడు అని కొందరు లబో దిబో మన్నారు. ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశపడి లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చామని, అసలు వడ్డీ రెండూ పోయాయి అని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు ప్రణాళికతోనే వ్యాపారి పారిపోయినట్లుగా బాధితులు అనుమానిస్తున్నారు. దీంతో బాధితులంతా నర్సంపేట పోలీసులను ఆశ్రయించి సదరు బంగారం వ్యాపారిపై ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వారు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+