సికింద్రాబాద్, కొమురవెల్లి రైల్వే స్టేషన్ లపై శుభవార్త!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పైన, కొమురవెల్లి రైల్వేస్టేషన్ల పైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభవార్త చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆధునీకరణ పనులు వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్‌ను వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి ప్రారంభిస్తామని ఆయన అన్నారు.

దాదాపు 50 శాతం పనులు పూర్తి
రైల్వే తయారీ యూనిట్ వచ్చే ఏడాది నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తుందని ఆయన అన్నారు. అమృత్ భారత్ స్టేషన్ల కార్యక్రమం కింద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన ఆధునీకరణ పనులను పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి, దాదాపు 50 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పారు. ప్రస్తుతం 1.97 లక్షల మంది ప్రయాణికులు స్టేషన్‌ను సందర్శిస్తున్నారని, ప్రతిరోజూ 100 రైళ్లు నడుస్తున్నాయని పేర్కొన్నారు.

Good news about Secunderabad and Komuravelli railway stations

మెట్రోతో అనుసంధానం చేస్తాం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యొక్క రెండు వైపులా మెట్రో మరియు బస్ స్టేషన్‌లను తూర్పు మరియు పశ్చిమ వైపులా అనుసంధానిస్తున్నామని అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యొక్క రెండు వైపులా అనుసంధానిస్తున్నామని ఆయన అన్నారు. ఎస్కలేటర్లు, వాక్‌త్రూలు మరియు భోజన సౌకర్యాలు వంటి అన్ని ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలను కూడా స్టేషన్‌లో కల్పిస్తున్నామని ఆయన అన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునికతకు పెద్దపీట
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునికతకు పెద్ద పీట వేస్తామని, సౌత్ ఇండియాలోనే దీనికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉండేలా ఆధునీకరణ పనులు చేస్తున్నామని అన్నారు. గంటకు సుమారు 23 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నా, పనులు వేగం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

వచ్చే ఏడాది డిసెంబర్ నెలలో ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం
కొత్త నిర్మాణాలలో భాగంగా సౌత్ మెయిన్ బిల్డింగ్, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, ట్రావెలర్ తో కూడిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు సాగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. వచ్చే ఏడాది డిసెంబర్ నెలలో ప్రధాని మోడీ చేతుల మీదుగా దీనిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మూడు ఎకరాల విస్తీర్ణంలో మూడు వేల మంది కూర్చునే విధంగా ఈ స్టేషన్ ను నిర్మిస్తున్నామన్నారు.

స్టేషన్ లో వసతులపై కేంద్రమంత్రి
స్టేషన్లో 26 లిఫ్టులు 32 ఎస్కలేటర్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. రెండు సబ్ స్టేషన్లు, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సిస్టం, ఐదు మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్, 5 లక్షల లీటర్ల సీవేజ్ ట్రీట్మెంట్ ఉంటాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+