రాములోరి భక్తులకు శుభవార్త.. వీఐపీలకు ప్రొటోకాల్ దర్శనం..
తెలంగాణలో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రం భ్రదాచలం. ఈ ఆలయం దక్షిణ భారతదేశ అయోధ్యగా కూడా పేరుగాంచింది. ఈ ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. భక్తుల సందర్శనార్థం ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేస్తుంటారు. నిన్న(ఆదివారం) తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో కొన్ని నూతన విధానాలను ఏర్పాటు చేశారు. ఇకనుంచి ఆలయానికి వచ్చే ప్రముఖులకు ప్రొటోకాల్ దర్శనం, వృద్ధులు, పిల్లలు, పసిపిల్లల తలుల్లు, నడవలేని వారికి నేరుగా రాములోరి దర్శనం కల్పించనున్నారు.
రాములోరి దర్శనానికి వచ్చే ప్రముఖులకు వీఐపీ దర్శనాలను ఏర్పాటు చేశారు. వీటితోపాటు 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు, దివ్యాంగులు, నడవలేని వారు, చంటి పిల్లల తల్లులు ఇక నుంచి నేరుగా దర్శనం చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల తాకిడి ఉన్నప్పుడు బేడా మండపంలో వేచి ఉండేందుకు సదుపాయాలు కల్పించనున్నారు. వీరికి సాయంగా వచ్చే వారికి కూడా దర్శన సదుపాయాన్ని కల్పించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఆలయంలో ముఖ్య ఉత్సవాలు, విశేష రోజుల్లో రద్దీని అనుసరించి వీటిలో మార్పులు ఉండవచ్చని ఆలయ ఈవో వెల్లడించారు.

వారికి ప్రత్యేక దర్శనం..
ప్రొటోకాల్ అర్హత ఉన్న ప్రముఖులు ముందుగా కార్యాలయంలో తమ వివరాలను అందించి రసీదు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. ఆలయంలోని చిత్రకూట మండపం ఎదుట గోకులం పక్కనున్న విభాగాన్ని ప్రొటోకాల్ ఆఫీసుగా ఏర్పాటు చేశారు. ఇందులో ఆలయ సిబ్బందికి విధులు కేటాయించారు. ప్రొటోకాల్ అర్హత ఉన్న ప్రముఖులు ముందుగా ఈ కార్యాలయంలో తమ వివరాలను ఇచ్చి రసీదు తీసుకోవాలి. ఆ రసీదు ఆధారంగా కోరుకున్న దర్శనం, పూజ చేయించుకునే వెసులుబాటు ఉంటుంది. వీరితో పాటు వృద్ధులకు పసిపిల్లలకు వారి తల్లులకు, నడవలేని వారికి కూడా స్పెషల్ దర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications