ప్రభుత్వరంగ సంస్థలు, సొసైటీలు, వర్సిటీల ఉద్యోగులకు గుడ్‌న్యూస్

రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, సొసైటీలు, వర్సిటీల ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారందరికీ ప్రభుత్వం ఐఆర్ మంజూరు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులతో సమానంగా వారికి మధ్యంతర భృతి మంజూరు చేసింది. మూల వేతనంపై 5శాతం ఐఆర్ మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, స్థానిక సంస్థల ఉద్యోగులకు గతేడాది అక్టోబరు 2న ఐఆర్ మంజూరు చేసింది. తమకు కూడా మధ్యంతర భృతి ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలు, యూనివర్సిటీల్లో పనిచేసే నాన్ టీచింగ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. అంగీకరించిన ప్రభుత్వం వారికి కూడా ఐఆర్ వర్తింపచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Good news for employees of public sector organizations societies and universities

పీఆర్సీ కమిటీ తన ప్రతిపాదనలు పంపినప్పటికీ.. అవి అమల్లోకి వచ్చేలోగా జరిగే ఆలస్యానికి ప్రతిఫలంగా ఉద్యోగి నష్టపోకుండా ప్రభుత్వం ఇచ్చే భృతినే మధ్యంతర భృతి అంటారు. ద్రవ్యోల్బణం, ధరలు ఇలా పలు అంశాల ఆధారంగా ఈ మధ్యంతర భృతి ఎంత శాతం ఇస్తే ఉద్యోగికి మేలు అనే విషయాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. పీఆర్సీ అమల్లోకి వచ్చిన వెంటనే ఈ మధ్యంతర భృతి రద్దతుంది.

లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణ ఉత్తర్వులు

ఫార్మా పరిశ్రమల ఏర్పాటుపై పెద్ద ఎత్తున నిరసనల రావడంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ జిల్లా లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజ్‌ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, ఆగస్టు 1న తెలంగాణ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.
లచగర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూ సేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం తాజాగా ఉపసంహరించుకుంది. వికారాబాద్ జిల్లాలో కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని లగచర్ల తోపాటు హకీంపేట, పోలేపల్లిలో ఫార్మా విలేజీల ఏర్పాటు ప్రతిపాదనలను వెనక్కి తీసుకుంది. మూడు గ్రామాల్లో 1358 ఎకరాల భూసేకరణ కోసం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లను ఉపసంహరించుకుంది.

ఫార్మా పరిశ్రమలపై లగచర్లలో రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో ప్రభుత్వం పునర్ సమీక్షించింది. అక్కడ పెట్టేది ఫార్మావిలేజి కాదని పారిశ్రామిక జోన్ అని ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫార్మా విలేజీల ఏర్పాటు కోసం భూసేకరణ ఉపసంహరించుకున్నట్లు వికారాబాద్ కలెక్టర్‌​కు టీజీఐఐసీ తెలిపింది. ఫార్మా విలేజీల బదులుగా మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం తాజాగా భూసేకరణ ప్రతిపాదనలు సమర్పించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+