హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. నుమాయిష్ ప్రారంభం ఆరోజు నుంచే.. ఈ సారి ప్రత్యేకంగా....
జనవరి వచ్చిందంటే హైదరాబాద్ నగరవాసులకు పండగ ముందుగానే స్టార్ట్ అవుతుంది. ఓవైపు న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటారు. మరోవైపు జనవరి 1 న ఏటా ప్రారంభం అయ్యే నుమాయిష్ కు వెళ్తుంటారు. ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 45 రోజులపాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ కు దేశవ్యాప్తంగా పేరుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ గా పేరుగాంచింది. ఈ నుమాయిష్ జాతరకు దాదాపు 85 ఏళ్ల చరిత్ర ఉంది. దేశవ్యాప్తంగా వేలాదిమంది ఇక్కడ స్టాళ్లు ఏర్పాటు చేసి తమ వస్తువులు, ఉత్పత్తులను విక్రయిస్తుంటారు. లక్షలాది మంది సందర్శకులు ఇక్కడకు విచ్చేస్తుంటారు.
హైదరాబాద్ లో అతిపెద్ద పండగ నుమాయిష్.. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు.. అంటే 45 రోజులపాటు సందర్శకులను అలరిస్తుంది. దేశంలోనే అతి పెద్ద ఎగ్జిబిషన్ గా పేరుగాంచింది నుమాయిష్. దేశ విదేశాలకు చెందిన ఉత్పత్తులను ఇక్కడ విక్రయిస్తుంటారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రముఖ సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, చిన్న, మధ్య తరహా వాణిజ్య, వ్యాపారులు, ఔత్సాహిక మహిళా వ్యవస్థాపకులు అన్ని రకాల ఉత్పత్తులతో కూడిన స్టాళ్లను ఏర్పాటు చేస్తారు.
ఇక ఈ ఎగ్జిబిషన్ ప్రవేశానికి రూ. 50 ఫీజు తీసుకుంటారు. ప్రతి రోజూ సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అలాగే శని, ఆదివారాల్లో, సెలవు దినాల్లో అయితే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది. మొత్తం 26 ఎకరాల్లో ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు.

ఈ ఏడాది మహిళలు, చిన్నారుల కోసం పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎగ్జిబిషన్ లో ఆకతాయిలను అరికట్టేందుకు భారీ స్థాయిలో పోలీసులను మోహరించనున్నట్లు వివరించారు. వందల సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications