ఉద్యోగులకు శుభవార్త.. రూ.707కోట్లు వారి ఖాతాల్లో!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇచ్చిన మాట ప్రకారం వరుసగా నాలుగవ నెలలోనూ శుభవార్త వినిపించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తుంది అనే విషయాన్ని తాజా చర్యతో ఉద్యోగులకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేసింది.
విడతల వారీగా పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం న్యాయపరంగా రావాల్సిన నిధులు, ఆర్థిక ప్రయోజనాలను అందించే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగాల బిల్లులకు 707.30 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఎత్తున పెండింగ్ బిల్లులు ఉన్న నేపథ్యంలో పెండింగ్ బిల్లుల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు విడతలవారీగా పెండింగ్ బిల్లులను చెల్లిస్తోంది.

707.30కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు
ఈ క్రమంలోనే నవంబర్ నెలలకు సంబంధించిన బకాయిలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. నవంబర్ నెల కు సంబంధించి 707.30 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఉద్యోగ సంఘాలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతినెల 700 కోట్లకు పైగా ప్రభుత్వం విడుదల చేస్తోంది.
ప్రభుత్వం చెల్లిస్తున్న పెండింగ్ బకాయిలు ఇవే
గత నాలుగు నెలలుగా విడతలవారీగా ప్రభుత్వం క్లియర్ చేస్తున్న ఈ బిల్లులలో గ్రాట్యుటీ, GPF, సరెండర్ లీవ్ మరియు వివిధ అడ్వాన్స్‌లు ఉన్నాయి. ఎంతోకాలంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులు, కొత్తగా రిటైర్ అయిన ఉద్యోగులు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఉద్యోగులకు రిలీఫ్
దీంతో వారి సమస్యల పరిష్కారానికి దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు వారికి చెల్లించాల్సిన బకాయిల విషయంలో కీలక హామీ ఇచ్చింది. విడతలవారీగా చెల్లింపు చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే వరుసగా నాలుగవ నెల బకాయిలను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనల మేరకు ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. దీంతో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విడతల వారీగా బకాయిలు ఇస్తున్న క్రమంలో కాస్త రిలీఫ్ అవుతున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications