తెలంగాణా ఆర్టీసీ శుభవార్త: ఆర్టీసీ బస్ స్టేషన్ల రూపురేఖలు మారనున్నాయ్!
తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తున్న నాటినుండి తెలంగాణ ఆర్టీసీ తీసుకుంటున్న నిర్ణయాల పైన రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఆర్టీసీలో అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటున్న క్రమంలో తాజాగా ఆర్టీసీ బస్టాండ్ లను ఆధునీకరించాలని నిర్ణయం తీసుకొని ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.
ఆర్టీసీపై సీఎం రేవంత్ ఫోకస్
దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ బస్టాండ్లలో అనేక చోట్ల సౌకర్యాల కొరత తీవ్రంగా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక ఈ పరిస్థితిని గమనించిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా బస్ స్టేషన్ల రూపురేఖలు మార్చడం కోసం 200 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ నిధులతో బస్ స్టాండ్ ల ఆధునీకరణ, విస్తరణ మరియు పునర్నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి.

బస్టాండ్ లను ఆధునీకరించాలని నిర్ణయం
ఇప్పటికే కొన్ని చోట్ల పనులు ప్రారంభం కాగా, మరికొన్ని ప్రాంతాలలో టెండర్ల ప్రక్రియ డిజైన్ల తయారీ దశలు కొనసాగుతున్నాయి. బస్టాండ్లు, డిపోల అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరాన్ని బట్టి బస్టాండ్ లను ఆధునీకరించాలని నిర్ణయించింది. వినియోగంలో లేని వాటిని కూడా ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
నిర్మాణాలు మొదలైన బస్ స్టేషన్లు
బస్టాండ్ల రద్దీ, ఆదాయ మార్గాలను పరిగణనలోకి తీసుకొని కొత్త బస్టాండ్ లను డిపోలను నిర్మించాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఇక ఇప్పటికే ములుగు, మధిర, మంథని వంటి చోట్ల కొత్త బస్టాండ్ ల నిర్మాణం చేయాలని ఎంపిక చేశారు. అయితే ప్రస్తుతం కాళేశ్వరంలో ఇంకా పనులు ప్రారంభం కాలేదు. మిగిలిన అన్ని చోట్లా పనులు కొనసాగుతున్నాయి.
ఈ బస్ స్టేషన్ ల ఆధునీకరణ పనులు
మాడ్గుల్, రేగొండ, నాగర్ కర్నూల్ లో కొత్త బస్ స్టేషన్ ల నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. ఇదే క్రమంలో కొన్ని ఇప్పటికే ఉన్న బస్ స్టాండ్ లను ఆధునీకరిస్తారు. మునుగోడు, గోదావరి ఖని. ఘన పూర్, గూడూరు, పాల్వంచ, వేములవాడ, గంగాధర, కథలాపూర్ లలో బస్ స్టాండ్ ల పునర్ నిర్మాణం, విస్తరణ కూడా త్వరలోనే మొదలు కానుంది. అంతేకాదు నిజామాబాద్, మహబూబ్నగర్ లలోని బస్ స్టేషన్లను ఆధునీకరిస్తారు.
ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచే లక్ష్యం
నెక్కొండ, నర్సంపేట లో బస్ స్టేషన్లను విస్తరించి షాపింగ్ కాంప్లెక్స్ లను నిర్మిస్తారు. మరోవైపు అశ్వరావుపేట. పెద్దపల్లిలో కొత్త బస్సు డిపో నుండి నిర్మించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. 2047 విజన్ తెలంగాణలో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థను 28 శాతం నుంచి 70 శాతం కు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్న క్రమంలో బస్టాండ్ల ఆధునీకరణ, డిపోల నిర్మాణం, కొత్త నిర్మాణ పనులు చేపట్టడం కోసం 200 కోట్ల రూపాయలను కేటాయించారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications