హైదరాబాద్‌లోని భ‌క్తుల‌కు గుడ్‌న్యూస్‌.. ఇక‌నుంచి తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదం ప్ర‌తిరోజు..

హైద‌రాబాద్ నగరంలోని శ్రీవారి భక్తులకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఓ శుభ‌వార్త‌ను అందించింది. ఇప్ప‌టివ‌ర‌కు హైదరాబాద్ హిమాయత్‌నగర్‌ లిబర్టీ, జూబ్లిహిల్స్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానాల్లో శనివారం, ఆదివారాల్లో మాత్రమే శ్రీవారి లడ్డూ ప్ర‌సాదం విక్రయించే వారు. ఇక‌నుంచి ఈ లడ్డూ ప్రసాదం ప్ర‌తిరోజూ శ్రీ‌వారి భ‌క్తుల‌కు అందుబాటులో ఉంటుందని టీటీడీ తెలిపింది. ఈ మేర‌కు ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ ప్రభు, ఎన్.నిరంజన్‌కుమార్‌లు ఒక ప్రకటనను కూడా విడుద‌ల చేశారు. హైదారాబాద్‌లోని శ్రీ‌వారి భ‌క్తుల‌కు లడ్డూ జారీలో టీటీడీ కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చిందని తెలిపారు.

క‌ళియుగ వైకుంఠ దైవ‌మైన శ్రీ‌వెంక‌టేశ్వ‌ర స్వామి ప్ర‌సాదం అంటే భ‌క్తుల‌కు ఎంతో ప్రీతి. ఈ ప్ర‌సాదం కోసం గంట‌ల త‌ర‌బ‌డి భ‌క్తులు క్యూలైన్ల‌లో వేచి ఉంటారు. ఇక‌నుంచి ఈ ల‌డ్డూ ప్ర‌సాదం ప్ర‌తి రోజూ అందజేయాలని ఆల‌య అధికారులు నిర్ణయం తీసుకుందన్నారు. ఈ లడ్డూ ధ‌ర రూ.50 ఉంది. ప్ర‌తి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హిమాయత్‌నగర్ లిబర్టీ, జూబ్లిహిల్స్ ఆలయాల్లో భ‌క్తుల‌కు లడ్డూ ప్ర‌సాదం అందుబాటులో ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. 50 రూపాయ‌ల‌కి ఒక లడ్డూ చొప్పున భక్తులకు శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌స్వామి లడ్డూ ప్రసాదం విక్రయించనున్నట్టు అధికారులు ప్రకటించారు.

Good news for the devotees in Hyderabad Tirumala Laddu Prasadam every day from now on

లడ్డూ ప్రసాదంలో నాణ్య‌త‌..

శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కేవలం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆలయాల్లోనే కాకుండా, ఇత‌ర సమాచార కేంద్రాల్లో కూడా విక్రయిస్తున్నారు. శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం, తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయం, కోదండరామ స్వామి ఆలయం, దేవుని కడప, పిఠాపురం, విజయవాడ, రాజమండ్రి, రంపచోడవడం, అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయం, వైజాగ్‌, అమరావతితో పాటు హైదరాబాద్‌‌లోని హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్, చెన్నైలోని టీటీడీ ఆలయాల్లో స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని విక్రయిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉండ‌గా, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నాణ్యతపై భక్తుల నుంచి వస్తున్న విమర్శలకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం స్పందించింది. ల‌డ్డూ ప్ర‌సాదంలో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టింది. శ్రీవారి లడ్డు ప్రసాద తయారీకి నందిని నెయ్యిని వాడేందుకు కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈమేరకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌తో టీటీడీ అధికారులు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+