కేంద్రం శుభవార్త.. ఇకపై ఇమ్మిగ్రేషన్ చిటికెలో... హైదరాబాద్ లోనూ త్వరలోనే !

సాధారణంగా విదేశాలకు ప్రయాణం చేసిన వారికి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి కనీసం 30 నిమిషాలు అయినా పడుతుంది. విదేశీయానం చేసిన వారు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత చేసే ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ ఒక్కోసారి వారి సహనానికి పరీక్ష పెడుతుంది. ఈ క్రమంలో ఇకపై ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ లో జాప్యం జరగకుండా కేవలం సెకన్లలోనే ఇమిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకునే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీ విమానశ్రయంలో ఇమ్మిగ్రేషన్ ఫాస్ట్ ట్రాక్ ప్రోగ్రాం
ఇందులో భాగంగా ఢిల్లీ విమానశ్రయంలో ఫాస్ట్ ట్రాక్ ప్రోగ్రాం ను ప్రవేశపెట్టింది. జూన్ 22వ తేదీన ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ట్రస్ట్ ట్రావెలర్ ప్రోగ్రాం ప్రవేశపెట్టిన క్రమంలో దీని కింద ఇమ్మిగ్రేషన్ త్వరగా కావాలని రిజిస్టర్ చేసుకున్న ప్రయాణికులకు బయోమెట్రిక్ లను ఉపయోగించి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ఎంట్రీ లోను ఎగ్జిట్ లోను వీటిని ఉపయోగిస్తున్నారు.

Good news from central govt immigration in seconds fast track immigration system Soon in Hyderabad too

హైదరాబాద్ తో పాటు ఈ నగరాల్లోనూ
అయితే ఈ విధానాన్ని త్వరలోనే హైదరాబాద్ లో కూడా తీసుకురానున్నారు. చెన్నై, ముంబై, కోల్కత్తా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, అహ్మదాబాద్ వంటి 7 ప్రధాన విమానాశ్రయాలకు ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ట్రస్ట్ ట్రావెలర్ ప్రోగ్రాం ను విస్తరించే పనిలో అధికారులు ఉన్నారు. ఇది త్వరలోనే దేశవ్యాప్తంగా 21 విమానాశ్రయాల్లో అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు.

ఈ ప్రోగ్రాంలో రిజిస్టర్ చేసుకున్న వారికే అవకాశం
భారతదేశం అంతర్జాతీయ గమ్యస్థానంగా మారుతున్న క్రమంలో విమానాయానాన్ని సునాయాసం చేయడం కోసం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. అర్హులైన ప్రయాణికులు ఆటోమేటిక్ గేట్లను ఉపయోగించుకోవడానికి సాధారణ మరియు ఇమ్మిగ్రేషన్ క్యూ లను దాటడానికి ఈ ప్రోగ్రాం లో రిజిస్టర్ చేసుకునే వారికి అవకాశం ఉంటుంది.

ఢిల్లీ లో ఈ విధానం సూపర్ సక్సెస్
ఇక ఈ ప్రోగ్రాం లో రిజిస్టర్ చేసుకున్న వారందరికీ సెకన్లలోనే సులభతరంగా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ జరిగిపోతుంది. ఢిల్లీ విమానాశ్రయంలో ఇప్పటికే ఈ విధానం సక్సెస్ ను సాధించింది. మొత్తం 18400 మంది ఈ విధానం ద్వారా ఇమ్మిగ్రేషన్ కు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమం కింద ప్రయాణికులు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ నోడల్ ఏజెన్సీ ద్వారా నమోదు చేసుకోవలసి ఉంటుంది.

ఫాస్ట్ ట్రాక్ విధానంలో రిజిస్టర్ అయితే వైట్ లిస్టు లో పేర్లు
ఇందులో నమోదు చేసుకున్న వారి పేర్లు ధ్రువీకరణ తర్వాత వైట్ లిస్టులో ఉంటాయి. ఈ వైట్ లిస్టులో పేర్లు ఉన్న ప్రయాణికులు ఈ గేట్ల ద్వారా ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ మంజూరైనట్టు బయటకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఇక హైదరాబాద్లోనూ ఈ విధానం త్వరలో అమల్లోకి రానుండడం అంతర్జాతీయ విమానాలలో ప్రయాణం చేస్తున్న వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+