విద్యుత్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త.. కరెంట్ చార్జీల పెంపు లేనట్టే!
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్త. వేసవికాలం వచ్చింది. మనందరి విద్యుత్ వినియోగం కూడా బాగా పెరుగుతుంది. ఈ సమయంలో తెలంగాణా రాష్ట్ర ప్రజానీకం మీద కరెంట్ చార్జీల బాదుడు ఈసారి ఉండబోదని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వెల్లడించింది. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని కోట్లాదిమంది వినియోగదారులకు ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని సంస్థ సీఎండీ జితేశ్ వి. పాటిల్ స్పష్టం చేశారు.
ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం పడకుండా నిర్ణయం
ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ సీఎండీ జితేష్ వీ. పాటిల్ తెలిపారు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులున్నా సరే ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కీలక ప్రకటనతో గృహ, వ్యాపార వర్గాల నుండి హర్షం వ్యక్తమవుతోంది.రాష్ట్రంలో విద్యుత్ కనెక్షన్ల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతోంది.

డిమాండ్ పెరుగుతున్నా, మెరుగైన విద్యుత్ సరఫరా
గత ఏడాది కన్నా ఈసారి కొత్తగా 12.09 లక్షల మంది వినియోగదారులు దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వ్యవస్థలో భాగమయ్యారు. ఫలితంగా, మొత్తం వినియోగదారుల సంఖ్య 1.20 కోట్లకు చేరింది. ఈ పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీఎండీ తెలిపారు.
గృహ జ్యోతి పథకంతో విద్యుత్ రంగంలో కీలక మార్పులు
ఎక్కడా కరెంట్ కష్టాలు లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ జ్యోతి పథకం కూడా విద్యుత్ రంగంలో కీలక మార్పులకు కారణంగా మారింది. ఉచిత విద్యుత్ అందించే ఈ పథకం సామాన్య ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తుంది. అంతేకాదు విద్యుత్ చౌర్యాన్ని గణనీయంగా తగ్గించింది. ప్రజలు ప్రస్తుతం సబ్సిడీ ప్రయోజనాలకే మొగ్గు చూపుతుండటంతో అనధికారిక కనెక్షన్లు తగ్గి, విద్యుత్ దుర్వినియోగానికి అడ్డుకట్ట పడింది.
'గృహజ్యోతి' పథకంతో సుమారు 5.44 కోట్ల జీరో బిల్లులు
ఈ పథకం ద్వారా విద్యుత్ శాఖ పారదర్శకతను పెంచగలిగిందని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ జితేశ్ వి. పాటిల్ పేర్కొన్నారు.ఆర్థిక విషయాలకొస్తే, 'గృహజ్యోతి' పథకం ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరి వరకు సుమారు 5.44 కోట్ల జీరో బిల్లులను ఇచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ఉచిత విద్యుత్ సబ్సిడీ కోసం ప్రభుత్వం నుంచి సంస్థకు సకాలంలో ప్రభుత్వం నుండి నిధులు అందుతున్నాయి.
వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్న TSSPDCL
ఇప్పటివరకు రూ. 1,930.66 కోట్లను ప్రభుత్వం సబ్సిడీగా జమ చేసింది. నిధుల లభ్యత సక్రమంగా ఉండటంతో సంస్థ నిర్వహణ మెరుగుపడిందని, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని సీఎండీ స్పష్టం చేశారు.మొత్తంగా విద్యుత్ విషయంలో ప్రజలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఈ వేసవికి అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నామన్నారు.
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications