ఉగాదికి ఆ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం.. మంత్రి శుభవార్త!

తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం శత విధాలా ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ముఖ్యంగా అందరికీ వైద్యం అందుబాటులోకి తీసుకు రావటం కోసం తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్యం పై దృష్టి సారించింది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణా వైద్యారోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ శుభవార్త చెప్పారు.

అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహ కీలకఆదేశం

పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఉచితంగా అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్‌నగర్ టిమ్స్‌ ఉగాది పండుగ రోజున ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. హాస్పిటల్‌లో అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు కావాల్సిన మౌలిక వసతులు సిద్ధం చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

good news on sanathnagar tims minister damodara rajanarsimha said tims will inaugurate on ugadi

వెయ్యి బెడ్ల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి టిమ్స్

ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ఆఫీస్‌లో టిమ్స్ సనత్‌నగర్ పనుల పురోగతి, డాక్టర్లు, సిబ్బంది నియామకంపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సనత్ నగర్ టిమ్స్ లో ఓపీ రూమ్‌లు, డయాగ్నస్టిక్స్‌, ఇన్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్లు, వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూల ఏర్పాటుపై మంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.. 1000 బెడ్ల కెపాసిటీతో నిర్మించిన సనత్‌నగర్ టిమ్స్‌లో మౌలిక వసతుల కల్పన తుది దశకు చేరుకుందని అధికారులు మంత్రికి వివరించారు.

మార్చి రెండో వారం నాటికి అన్ని పనులు

హాస్పిటల్‌ అత్యంత కీలకమైన 16 ఆపరేషన్ థియేటర్లు శస్త్రచికిత్సలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. రోగ నిర్ధారణ కోసం అత్యాధునిక సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, డిజిటల్ ఎక్స్-రే మిషన్ల ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. డయాగ్నస్టిక్స్ యంత్రాలు ఇన్‌స్టాలేషన్ జరుగుతోందన్నారు. మార్చి రెండో వారం నాటికి అన్ని పనులు, ఎక్విప్‌మెంట్ ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.

ఉగాది నాటికి హాస్పిటల్‌ ప్రారంభం

రోగులకు ఓపీ రిజిస్ట్రేషన్ నుంచి డిశ్చార్జి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ-హెచ్‌ఎంఐఎస్ సాఫ్ట్‌వేర్ ద్వారా సేవలను అనుసంధానించాలని మంత్రి సూచించారు. రోగులకు, వారి సహాయకులకు నాణ్యమైన భోజనం అందించేందుకు సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని సూచించారు. మార్చి 15 నాటికి పెండింగ్‌లో ఉన్న చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేసి, ఉగాది నాటికి హాస్పిటల్‌ను ప్రారంభానికి సిద్ధం చేయాలని మంత్రి స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+