ప్రయాణికులకు ఆర్టీసీ తీపి కబురు.. మహిళలకు పండుగే!
ఆర్టీసీ ప్రయాణికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. వచ్చే వారం రోజుల్లో మహిళా సమాఖ్యల ద్వారా 350 కొత్త బస్సులను ప్రారంభిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహిళా సమాఖ్యల ద్వారా కొత్త బస్సులను కొనుగోలు చేసే ఆర్టీసీకి అద్దెకు పెట్టి మహిళలకు కావలసిన ఆర్థిక మద్దతును ఆర్టీసీ అందిస్తుందని ఆయన తెలిపారు.
ఆ జిల్లాలో ప్రతీ మండలానికి ఒక బస్సు అదనంగా కేటాయింపు
ఆర్టీసీ సేవల విస్తరణ పైన ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులతో, అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతి మండలానికి ఒక బస్సు కేటాయిస్తామని చెప్పారు. మహా లక్ష్మీ పథకం కారణంగా పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచుతున్నామని తెలిపారు.
తెలంగాణలో మహా లక్ష్మీ పథకం అమలుతో పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.

జిల్లాల వారీగా ఆర్టీసీ అవసరాలపై ప్రతిపాదనలు
ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకట్ స్వామి, సీతక్క, వాకిటి శ్రీహరి పాల్గొని తమ తమ నియోజకవర్గాల అవసరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు , ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతి నియోజకవర్గానికి అవసరమైన బస్సులు, కొత్త రూట్లు, బస్ స్టేషన్ల అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు.
చిన్న పల్లెలకు మినీ బస్సులపై ప్రతిపాదనలు
ముఖ్యంగా కొత్త రూట్లలో బస్సులు నడపడం, విద్యార్థుల సమయానికి బస్సులు అందుబాటులో ఉంచడం, చిన్న పల్లెలకు మినీ బస్సులు ప్రవేశపెట్టడం వంటి సూచనలు చేశారు.ములుగు జిల్లాలో ఏటూరు నాగారం డిపో, ములుగు బస్ స్టేషన్ పనులు వేగవంతం చేయాలని మంత్రి సీతక్క రవాణా శాఖ మంత్రి కి అధికారులకు సూచించారు, మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయం వద్ద శాశ్వత బస్ స్టేషన్ నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు.
జిల్లాల వారీగా ఆర్టీసీ కొత్త రూట్లు, బస్సుల పెంపుపై చర్చ
వరంగల్ ప్రాంతంలో కాకతీయ యూనివర్సిటీకి ప్రత్యేక బస్సులు, హనుమకొండ బస్ స్టేషన్ ఆధునీకరణ వంటి ప్రతిపాదనలు వచ్చాయి. నిజామాబాద్ జిల్లాలో కొత్త బస్ స్టేషన్లు, అదనపు బస్సులు, పార్కింగ్ సౌకర్యాలపై ఎమ్మెల్యేలు సూచనలు చేశారు. మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్‌కర్నూల్ ప్రాంతాల్లో కూడా కొత్త రూట్లు, బస్సుల పెంపు, బస్ డిపోలు ఏర్పాటు వంటి డిమాండ్లు వ్యక్తమయ్యాయి.
ఆర్టీసీ సేవలను విస్తరిస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్
అలంపూర్, జడ్చర్ల, అచ్చంపేట ప్రాంతాల్లో బస్సుల కొరతను ప్రస్తావిస్తూ కనెక్టివిటీ మెరుగుపరచాలని ప్రజా ప్రతినిధులు మంత్రిని కోరారు. అలాగే బస్ స్టేషన్లలో టాయిలెట్స్, షాపింగ్ కాంప్లెక్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఆర్టీసీ విస్తరణపై దృష్టి పెట్టడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని, సాధ్యాసాధ్యాలను బట్టి ఆర్టీసీ సేవలను విస్తరిస్తామని చెప్పారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం













Click it and Unblock the Notifications