Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైతుల ఖాతాల్లో 5రోజుల్లోనే డబ్బులు జమ.. తీపి కబురు!

తెలంగాణ రాష్ట్రంలోని పత్తి రైతులకు శుభవార్త. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు చేయడానికి పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక పత్తి రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా నమోదు చేసుకొని స్లాట్ బుక్ చేసుకుని పత్తిని విక్రయించాలని, కేంద్ర ప్రభుత్వం పత్తికి మంచి గిట్టుబాటు ధరను ఇస్తుందని ఇప్పటికే రాష్ట్రంలో మంత్రులు పదే పదే చెబుతున్నారు.

పత్తి రైతులకు శుభవార్త చెప్పిన మంత్రి కొండా సురేఖ
ఇదే క్రమంలో తాజాగా రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా పత్తి రైతులకు శుభవార్త చెప్పారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం నాడు పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆమె రైతులు సిసిఐ ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రంలో పత్తిని విక్రయించుకోవాలని సూచించారు.పత్తిని విక్రయించిన ఐదు రోజుల్లోనే రైతులు ఖాతాలలో డబ్బులు జమ అవుతాయని కొండా సురేఖ తీపి కబురు చెప్పారు.

good news to farmers money credited in farmers accounts in five days after they sold their cotton

నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి గరిష్ట ధర పొందాలన్న మంత్రి
రైతు సంతోషంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుందని పేర్కొన్న ఆమె, రైతులు నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి గరిష్ట ధరను పొందాలని మంత్రి కొండా సురేఖ సూచించారు.
ఎనుమాముల మార్కెట్ కు వచ్చిన ప్రతి పత్తిబస్తాను కొనుగోలు చేస్తామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని మంత్రి కొండా సురేఖ సూచించారు. తేమను దృష్టిలో పెట్టుకొని ధర నిర్ణయించడం వల్ల, ప్రేమ కారణంగా రైతులు నష్టపోకుండా ఉండేవిధంగా కమిటీ వేసినట్టు ఆమె తెలిపారు.

రైతులకు నేరుగా అకౌంట్ లో డబ్బులు
పత్తిని విక్రయించే రైతుకు మూడు నుండి ఐదు రోజుల్లోనే సంబంధిత రైతు బ్యాంకు అకౌంట్ లో నేరుగా డబ్బులు అవుతాయని కొండ సురేఖ అన్నారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్రంలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి సారధ్యంలో రైతు రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని కొండా సురేఖ అన్నారు.

రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు
సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని, వడ్లు కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతులకు డబ్బులు జమ అవుతున్నాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. అటు అధికారులకు కూడా రైతులకు ఇబ్బంది కలుగకుండా ఉండేలా పత్తి కొనుగోలు చేయాలని సూచించారు. ఇక తేమ పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టాలని చూస్తే ప్రభుత్వ ఉపేక్షించదని, రైతులు కూడా పొలాల వద్దనే తేమశాతం పరిశీలించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా రైతులకు నష్టం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+