NEW RATION CARDS: కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునేవారికి గుడ్ న్యూస్

కొత్త రేషన్ కార్డులపై గత కొన్ని రోజులుగా నెలకున్న సందిగ్ధతకు తెరపడింది. కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకునే వారు ఇక నుంచి మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఒక్కో దరఖాస్తుకు రూ.50 మాత్రమే తీసుకోవాలని మీసేవ కేంద్రాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

వాళ్లు మళ్లీ దరఖాస్తు అవసరం లేదు..

ఈ మేరకు సోమవారం సివిల్ సప్లయిస్ భవనంలో జరిగిన సమావేశంలో మీసేవ అధికారులతో ఆ శాఖకు సంబంధించిన అధికారులు సమావేశం అయ్యారు. మీసేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డులకోసం దరఖాస్తులను స్వీకరించేందుకు అధికారులు అంగీకరించారు. మరోవైపు.. ప్రజాపాలన లేదా కులగణన ప్రక్రియ ద్వారా అప్లై చేసుకున్న వాళ్లు మళ్లీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. ప్రజాపాలన, కులగణన లో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని మళ్లీ దరఖాస్తు అవసరం లేదని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.

Government Introduces Ease Apply for New Ration Cards via Meeseva Kendras

41 లక్షల కొత్త రేషన్ కార్డులు..

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 41 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తెలిపారు. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించాలని దీంతో.. డూప్లికేట్ లేకుండా అర్హులకు అందేందుకు వీలుంటుందని పౌరసరఫరాల శాఖ పేర్కొంది. తెల్లరేషన్ కార్డు కోసం గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలు లోపు వార్షికాదాయం ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో మాగాణి మూడున్నర ఎకరాలు, చెలక ఏడున్నర ఎకరాల గరిష్ఠ పరిమితిని ప్రభుత్వం విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+