గవర్నర్ గ్రీన్ సిగ్నల్ - కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం..!?
తెలంగాణలో రాజకీయంగా ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ దాఖలుకు ఏసీబీ గవర్నర్ అనుమతి కోరింది. సీఎం రేవంత్ సైతం గవర్నర్ తో ఈ అంశం పైన చర్చలు చేసారు. గవర్నర్ అనుమతి ఇస్తే విచారణ జరుగుతుందని చెప్పారు. ఈ కేసులో అరెస్ట్ చేయాలనుకుంటే తాను సిద్దమని కేటీఆర్ స్పష్టం చేసారు. ఇప్పుడు గవర్నర్ అనుమతితో కేటీఆర్ కు ఉచ్చు బిగుస్తోంది. అరెస్ట్ ఖాయమనే వాదన తెర మీదకు వచ్చింది.
కీలక పరిణామాలు
తెలంగాణలో ఒకటి రెండు రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నా యి. ఫార్ములా ఈ రేసు కేసులో రూ 46 కోట్ల చెల్లింపుల విషయంలో కేటీఆర్ పైన అభియోగాలు ఉన్నాయి. హెచ్ఎండీఏ అనుమతి లేకుండా మంత్రిగా కేటీఆర్ చెల్లింపులు చేసారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో కేటీఆర్ తో పాటు అప్పటి మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, చీఫ్ ఇంజినీర్ లను కూడా విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ ఫార్ములా రేసు నిధుల మళ్లింపునకు సంబంధించి అర్వింద్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు. ఈ కేసు విచారిస్తున్న ఏసీబీ కేటీఆర్ విచారణ కోసం గవర్నర్ అనుమతి కోరింది.

సిద్దమంటూ కేటీఆర్
ఈ విషయం పైన రేవంత్ సైతం క్లారిటీ ఇచ్చారు. గవర్నర్ అనుమతి ఇస్తే తదుపరి విచారణ కొనసాగుతుందని చెప్పారు. కేటీఆర్ ఈ అంశం పైన ఇప్పటికే స్పందించారు. ఈ కేసులో తాను హైదరాబాద్ బ్రాండ్ ప్రమోషన్ కోసం నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ప్రభుత్వం తనను అరెస్ట్ చేయాలని కోరుకుంటే తాను అరెస్ట్ అవ్వటానికి సిద్దంగా ఉన్నానని చెప్పారు. అయితే, ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇవ్వటం తో కేటీఆర్ అరెస్ట్ పైన ఊహాగానాలు మొదలయ్యాయి. గవర్నర్ అనుమతితో ఏసీబీఐ కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఏసీబీ సిద్దం అవుతున్నట్లు సమాచారం.హెచ్ఎండీఏ బోర్డు అనుమతి లేకుండా రెండు విడతలుగా 46 కోట్ల రూపాయల నిధులను కేటీఆర్ విడుదల చేశారనేది ప్రధాన ఆరోపణ.
వాట్ నెక్స్ట్
తాను మంత్రిగా ఈ ఫార్ములా రేసు కోసం నిధులను విడుదల చేసానని కేటీఆర్ చెబుతున్నారు. ఈ నిధుల కంటే ఈ రేసు ద్వారా హైదరాబాద్ కు వచ్చిన ఇమేజ్ చాలా ఎక్కువ ఉందనే నివేదికలు ఉన్నాయన్నారు. అయితే, ఇప్పుడు గవర్నర్ అనుమతి వచ్చినట్లు అధికార వర్గాల సమాచారం. దీంతో, ఏసీబీ ఈ కేసులో ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది కీలకంగా మారుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ మంత్రులు గత ప్రభుత్వంలో అక్రమాలు చేసిన కొందరు ముఖ్యలు అరెస్ట్ తప్పదనే వ్యాఖ్యలు చేసారు. దీంతో, ఇప్పుడు గవర్నర్ అనుమతి.. అరెస్ట్ కు సిద్దమంటూ కేటీఆర్ ప్రకటన ... ప్రభుత్వం తీసుకునే చర్యల పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications