రేవంత్ అనూహ్య నిర్ణయం - కేసీఆర్ కు చెక్, కీలక మలుపు..!!
తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసా గుతున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రెండు చారిత్రాత్మక బిల్లు లకు అసెంబ్లీ వేదికగా నిలవనుంది. ముఖ్యమంత్రి రేవంత్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బీసీ రిజ ర్వేషన్లు.. ఎస్సీ వర్గీకరణ బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఈ రోజు , రేపు సభలో చర్చించి ఆమోదించనున్నారు. ఈ రెండు బిల్లుల ఆమోదం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.
రేవంత్ అనూహ్య నిర్ణయం
ముఖ్యమంత్రి రేవంత్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రెండు బిల్లులు అసెంబ్లీలో నేడు ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడం తో పాటుగా సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత అంశాలను కల్పించేలా రూపకల్పన చేసిన బిల్లులు సభ ముందుకు తెస్తోంది. ఈ రెండు బిల్లులకు ఇప్పటికే తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలపడంతో బిల్లులకు శాసనసభలో ప్రవేశ పెట్టనున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణలపై శాసనసభ, మండలిలో ఈ రోజు.. రేపు (సోమ, మంగళ వారం) ప్రత్యేక చర్చ జరగనుంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల అంశం పైన అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది.

అసెంబ్లీలో బిల్లులు
తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం సామాజిక, ఆర్థిక, కుల సర్వేను నిర్వహించి నివేదికలు సిద్దం చేసింది. ఈ నివేదిక ప్రకారం బీసీలతో పాటు కులాల వారీగా జనాభా లెక్కలు బహిర్గతమయ్యాయి. బీసీల జనాభా ప్రకారం సామాజిక న్యాయం కల్పించేందుకు వారి రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 29 శాతం అమలవుతున్నాయి. ఇందులో బీసీలకు 25, ముస్లింలకు బీసీ-ఈ కింద 4 శాతం ఉంది. 42 శాతానికి పెంచేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుల పై చర్చ వేళ మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో చర్చకు రానుంది.
ఎస్సీ వర్గీకరణ
ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీం తీర్పుతో తెలంగాణలో అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో న్యాయ వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ప్రభుత్వం జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ ఇచ్చని నివేదికలో ఎస్సీ ఉప కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించాలని సిఫారసు చేసింది. ఈ వివరాలను ప్రభుత్వం సభలో వెల్లడించింది. కాగా, గ్రూపుల వర్గీకరణపై మరికొన్ని కుల సంఘాల నుంచి అభ్యంతరాలు, సూచనలు రావడంతో వాటిని పరిశీలించాలని కమిషన్‌ను ప్రభుత్వం కోరింది. వాటిని పరిశీలించి న షమీమ్ అక్తర్ కమిషన్ తాజాగా ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక మేరకు బిల్లు సిద్దమైంది. దీంతో, ఈ రెండు రోజులు అసెంబ్లీలో ఈ బిల్లుల పైన చర్చ కీలకంగా మారనుంది.












Click it and Unblock the Notifications