గృహలక్ష్మి పథకం దరఖాస్తుకు చివరి తేదీ రేపే: అసత్య ప్రచారాలు నమ్మొద్దన్న మంత్రి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం స్థలం ఉండి.. ఇళ్లు లేని పేదల కోసం గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారికి ప్రభుత్వం రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపింది. గృహలక్ష్మి పథకం దరఖాస్తులకు ప్రభుత్వం ఆగస్టు 10ని గడువుగా నిర్ణయించింది. అర్హులైనవారు ఆగస్టు 10లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
సోమవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఆదేశాలు ఇవ్వగా.. సాయంత్రం పలు కలెక్టరేట్లలో గడువు, ఇతర వివరాలతో కూడిన ప్రకటనలు జారీ చేశారు. ఆగస్టు 10వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులకు మొదటి విడతలో అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత వచ్చిన వాటిని రెండో విడతలో అవకాశం కల్పిస్తారు.

ఆగస్టు 20వ తేదీలోగా గృహలక్ష్మి పథకం మొదటిదశ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. 10వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులకు రెండో విడతలో పరిశీలించాలని నిర్ణయించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో దరఖాస్తులను పరిశీలించి అర్హులను పరిశీలించి అర్హులను ఎంపిక చేశారు. జిల్లా మంత్రి ఆమోదంతో జాబితాను సిద్ధం చేస్తారు.
కాగా, గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు అసత్య ప్రచారం చేస్తున్నాయని.. వాటిని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ఖాళీ స్థలం ఉన్నవారెవరైనా సరే గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తుదారులు తమ ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తులు పంపించవచ్చని పేర్కొన్నారు.
ప్రస్తుతం మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేళ ఇళ్లు పూర్తయితే.. రెండో దశలో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఇళ్లు లేని పేదలు ఆందోళన చెందవద్దని, దశలవారీగా ఇంటి నిర్మాణాల కోసమే ఈ పథకం అమలు చేస్తున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు.
అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు ఫారంతోపాటు ఖాళీ భూమి రిజిస్ట్రేషన్, కులం, ఆదాయ రుజువు, ఆధార్, ఆహార భద్రత కార్డ్, బ్యాంక్ ఖాతా జిరాక్స్ కాపీలను జత చేయాలి. దరఖాస్తు స్వీకరణకు ఎమ్మార్వో, మున్సిపల్, కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు.
గృహలక్ష్మి పథకం అర్హతలు, మార్గదర్శకాలు
మహిళల పేరిటే గృహలక్ష్మి పథకం మంజూరవుతుంది.
దరఖాస్తుదారులు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా స్తానికులై ఉండాలి.
ఆధార్ లేదా ఓటర్ గుర్తింపు కార్డు కలిగి ఉండాలి.
ఇంటి నిర్మాణానికి ఖాళీ స్థలం ఉండాలి.
లబ్దిదారుడు లేదా ఆ కుటుంబసభ్యులు పేరిట ఆహార భద్రత కార్డు ఉండాలి.
దరఖాస్తుదారుడు దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి.
బ్యాంకులో ప్రత్యేక ఖాతా తెరవాలి. తప్పనిసరిగా ప్రభుత్వ బ్యాంక్ ఖాతానే ఉండాలి.
జన్‌ధన్ ఖాతాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపయోగించరాదు.
ఇప్పటికే ఆర్సీసీ ఇళ్లు ఉన్నవారు, ఆర్డర్ 59 కింద లబ్ధిపొందిన వారు ఈ పథకానికి అనర్హులు.
ఈ పథకం కింద ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలు, మైనార్టీలకు 50 శాతం మంది లబ్ధిదారుల ఎంపిక చేస్తారు. దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ ఉంటుంది.
-
"హైదరాబాద్"లో నీటి సరఫరా బంద్.. ఎప్పుడు ? ఎక్కడెక్కడంటే ? ? -
మాటలతో, మూటలతో ఎన్నికల్లో గెలిచేవాళ్లం కాదు - సీఎం రేవంత్ రెడ్డి -
హైదరాబాదీ మటన్ దాల్చా.. ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు! -
హైదరాబాద్ కు తలమానికంగా మరో రైల్వే స్టేషన్ రెడీ అన్న కేంద్రమంత్రి -
హైదరాబాద్ లో ఆ ఫ్లైఓవర్ సంగతి తేల్చండి.. !! -
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..! -
Todays Horoscope: ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు- ఆ రాశి వారికి ధన లాభాలు..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
మనకు మరో వందేభారత్, రెండు అమృత్ భారత్ ఖరారు- ఇక 3 గంటల్లోనే, రూట్..!!












Click it and Unblock the Notifications