Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సన్నాసులైతే ఎందుకు చేర్చుకున్నావు: కెసిఆర్‌కు గుత్తా ప్రశ్న

హైదరాబాద్: తమ పార్టీ నాయకులు సన్నాసులతై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో ఎలా చేర్చుకున్నావని కాంగ్రెసు తెలంగాణ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, కాంగ్రెసును తిట్టుకుంటూ కెసిఆర్ కాలం గడుపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెసు తలపెట్టిన పథకాలతోనే నీరు అందించడానికి కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు. పాలమూరు, డిండి నీటి పారుదల ప్రాజెక్టులను స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కెసిఆర్, చంద్రబాబు నాయుడు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.

Gutta Sukhender Reddy lashes out at KCR

లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజల తీర్పుకు భిన్నంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రవర్తించారని కాంగ్రెస్‌ నేత గండ్ర వెంకటరమణ ఆరోపించారు. శుక్రవారం నాడు ఆయన వరంగల్‌లో మీడియాతో మాట్లాడారు. గండ్ర మళ్లీ ఉప ఎన్నిక నిర్వహించడం ద్వారా ప్రజలపై భారం పడుతుందన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ కెసిఆర్‌తో పొత్తుపెట్టుకోవడం ఉద్యమ ద్రోహమేనన్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెబుతామని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+