టిఆర్ఎస్‌లోకి కోమటిరెడ్డి సోదరులు: గుత్తా షాకింగ్ కామెంట్స్

Posted By:
Subscribe to Oneindia Telugu

నల్గొండ: కోమటిరెడ్డి సోదరులపై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి సోదరులు మతిస్థిమితం లేకుండా మాల్లాడుతున్నారని సుఖేందర్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

గుత్తాకు హైకోర్టు షాక్: పిటిషన్ ఉపసంహరణకు నో

గురువారం ఆయన నల్గొండలో విలేకరులతో మాట్లాడారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఓ వైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిడుతూ మరోవైపు టీఆర్‌ఎస్‌లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మెడికల్ కాలేజీ గురించి మాట్లాడే నైతిక హక్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లేదన్నారు.

Gutta sukhender reddy sensational comments on Komatireddy brothers

జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ కేటాయించే యోచనలో కేసీఆర్‌ ఉన్నారని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. అయితే జిల్లాకు మెడికల్ కాలేజీ వస్తోందనే ధీమాతోనే వెంకటరెడ్డి దొంగ దీక్షలకు సిద్ధమవుతున్నారని గుత్తా విమర్శించారు.

ఉత్తమ్‌ను తప్పించకపోతే ఎన్నికల్లో పోటీచేయను: కోమటిరెడ్డి సంచలనం

గురువారం నాడు ఉదయం నల్గొండలో మటన్ మార్కెట్ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో టిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. ఈ కార్యక్రమానికి ఎంపీ సుఖేందర్‌రెడ్డిని ఆహ్వనించలేదంటూ టిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకొంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nalgonda Mp Gutta Sukhender reddy sensational comments on Komatireddy brothers on Thursday at Nalgonda.Komatireddy brothers planning to join in Trs said Sukhender reddy .

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి