అఘాయిత్యం: చిన్నారిని చిదిమేసిన పాత నేరస్థుడు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తన కూతురుతో ఆడుకోవటానికి వచ్చి అక్కడే నిద్రపోయిన ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దొంగ శ్రీను నే పాత నేరస్థుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. తీవ్రమైన రక్తస్రావం, భరించలేని నొప్పిని చెప్పుకోలేక ఆ బాలిక రాత్రంతా బిక్కుబిక్కుమంటూ అక్కడే గడిపింది.

తెల్లవారుజామున రక్తంతో తడిచిన దుస్తులతో రోదిస్తూ ఇంటికి వెళ్లింది. పాప పరిస్థితిని చూసి తండ్రి బిత్తరపోయాడు. చిన్నారిపై జరిగిన అఘాయిత్యాన్ని హైదరాబాదులోని మలక్‌పేట పోలీసుల దృష్టికి తెచ్చారు. తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొనేందుకు వెళ్లగా తాగిన మైకంలో హంగామా సృష్టించాడు.

Habitua criminal sexually assaults a girl in Hyderabad

హైదరాబాద్‌లోని సైదాబాద్‌లోని ఫరా కాలనీకి చెందిన శ్రీనివాస్ పారిశుద్ధ్య కార్మికుడు. భార్య చనిపోవటంతో కూతురు (6)తో కలిసి జీవనం సాగిస్తున్నాడు. పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ ఎక్కడ రాత్రయితే అక్కడే కూతురుతో నిద్రించేవాడు. ఇదిలావుంటే, అస్మాన్‌గఢ్‌లోని హమాలీ బస్తీకి చెందిన దొంగ శ్రీను (35) పాత నేరస్తుడు. బుధవారం రాత్రి భార్యతో దొంగ శ్రీను భార్యతో గొడవపడ్డాడు. దాంతో చిన్నకూతురును ఇంట్లోనే వదిలి మరో ముగ్గురు పిల్లలను వెంటబెట్టుకొని ఆమె తల్లిగారింటికి వెళ్లింది.

గురువారం తన స్నేహితుడైన దొంగ శ్రీను కూతురుతో ఆడుకొంటుడడంతో తన కూతురు(6)ను శ్రీనివాస్ అక్కడే వదిలివెళ్లాడు. రాత్రి కావడంతో చిన్నారి అక్కడే నిద్ర పోయింది. రాత్రి చిత్తుగా తాగిన వచ్చిన దొంగ శ్రీను తన కూతురు పక్కన పడుకున్న చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మలక్‌పేట ఇన్‌స్పెక్టర్ అల్లూరి గంగారెడ్డి కేసు నమోదుచేసుకొని నిందితున్ని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం చిన్నారిని భరోసా సెంటర్ (హాకా భవన్)కు తరలించనున్నట్లు గంగారెడ్డి తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hibitual criminal has sexually assaulted a 6 year old girl at Malakapet in Hyderabad

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి