వైభవంగా హనుమాన్ జయంతి.. హైదరాబాద్ లో కన్నులపండుగగా హనుమాన్ శోభాయాత్ర!

హనుమాన్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ రోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ తెల్లవారుఝాము నుంచే భక్తులు ఆంజనేయస్వామి ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాగా హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో పలు ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య హనుమాన్ జయంతి శోభాయాత్రలు ప్రారంభం అయ్యాయి. శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు పలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

కొండగట్టు కాషాయ వర్ణం
ఇక హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. భక్తులు కాలి నడకన కిలోమీటర్ల దూరం నుండి అంజన్నను దర్శనం చేసుకోవటానికి వస్తున్నారు.నిన్నటి నుండి మూడు రోజుల పాటు కొండగట్టు ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశారు.

Hanuman Jayanti in grand manner in telangana Hanuman Shobha Yatra as eye feast in Hyderabad

రాజన్న సిరిసిల్ల జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జిల్లాలోని వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలోని అంజనేయ స్వామి ఆలయంతో పాటు అగ్రహారం ఆంజనేయ స్వామి ఆలయానికి నిన్న రాత్రి నుండే భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. దీక్షాపరులతో ఆలయ పరిసరాలు కాషాయ వర్ణమయ్యాయి. ఆలయాలలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారిని దర్శించుకొని దీక్షలను విరమిస్తున్నారు.

గౌలిగూడ శ్రీ రామమందిరం నుంచి హనుమాన్ శోభాయాత్ర
హనుమాన్ జయంతి సందర్భంగా జంట నగరాల్లో ఏటా సాంప్రదాయ సిద్దంగా జరిగే ప్రధాన శోభాయాత్ర ప్రశాంతంగా ప్రారంభం అయింది. నగరంలో గౌలిగూడ శ్రీ రామమందిరం నుంచి తాడ్‌బండ్ హనుమాన్ మందిరం వరకు 12 కిలోమీటర్ల పైగా దూరం ఈ హనుమాన్ శోభాయాత్ర సాగుతుంది. ప్రధాన యాత్రలో పలు ప్రాంతాలనుంచి చిన్న యాత్రలు కూడా కలుస్తాయి. రాత్రి దాదాపు 8 గంటలవరకు సాగే ఈ శోభాయాత్ర పుత్లిబౌలి, కోఠి, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, కవాడిగూడ ప్రాంతాల మీదుగా కొనసాగుతుంది.

శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా పోలీసుల నిఘా
కాగా శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు అనుమతి ఉన్న ర్యాలీలనే పోలీసులు అనుమతిస్తూ, ప్రతి ర్యాలీని వీడియో కెమెరాతో చిత్రీకరిస్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు పికెట్లను కూడా ఏర్పాటు చేశారు. కాగా శోభాయాత్ర సందర్భంగా పలు ప్రాంతాలలో వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. పలు చోట్ల రాకపోకలను మళ్ళించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+