వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు తెలంగాణ ప్రజల ఉసురు: హరీష్ రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

సిద్దిపేట‌/హుజూరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ ప్రజల ఉసురు ముడుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి 53 శాతం విద్యుత్తు ఇవ్వాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించినా పట్టించుకోవడం లేదని ఆదివారంనాడు సిద్దిపేటలో అన్నారు. విద్యుత్తు ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆంధ్రా నాయకుల కుట్రవల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. ఇప్పుడు స్వరాష్ట్రం, స్వపరిపాలన సాగుతుందని, రెండేళ్లలో విద్యుత్తు సమస్య ఉండదని రైతులకు భరోసా ఇచ్చారు.

విద్యుత్‌ కోతలపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌ నేతలలకు లేదని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇప్పుడు విద్యుత్తుకు సమస్య ఏర్పడిందన్నారు. దాంతో,వ్యవసాయ రంగానికి 5 నుంచి 6 గంటలు మాత్రమే విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు.

Harish Rao accuses AP CM Chandrababu

సమస్య పరిష్కారానికి బయోమాస్‌ ప్లాంట్‌, థర్మల్‌ ప్రాజెక్ట్‌ల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో సీఎం కేసీఆర్‌ విద్యుత్‌ కొరతపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఖరీఫ్‌ పంట ఎండి పోకుండా 7 గంటల పాటు విద్యుత్‌ను అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.

ఎంత ఖర్చు చేసైనా విద్యుత్‌ను కొనుగోలు చేసి పంటలు ఎండి పోకుండా కాపాడుతామని ఈటెల చెప్పారు. నేదునూరులో 1100 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కోసం 400 ఎకరాలు అందుబాటులో ఉండగా మరో 300 ఎక రాల కోసం స్థల సేకరణ చేపడుతామన్నారు. విభజన సందర్భం గా ఎన్టీపీసీలో 4వేల మెగావాట్ల ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చిందన్నారు.

ఇల్లందులో 4వేల మెగావా ట్లు, మణుగూరులో 800 మెగావాట్లు, సాగర్‌ ప్రాజెక్ట్‌ టేల్‌ పాం డ్‌లో 9వేల మెగావాట్లు, శ్రీశైలం రివర్స్‌ ప్రాజెక్ట్‌లో 800 మె గావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రానున్న మూడేళ్లలో దేశంలోనే తెలంగాణలో వి ద్యుత్‌ని అధికంగా ఉత్పత్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.

English summary
Telangana ministers Harish Rao and Etela Rajender accused Andhra Pradesh CM Nara Chandrababu Naidu for power shortage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X