జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బుచ్చవ్వను మెచ్చుకున్న మంత్రి హరీష్ రావు .. నిజంగానే ఈ అవ్వ గ్రేట్ .. ఎందుకంటే

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించి అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. తొలిదశ లాక్ డౌన్ నేటితో ముగుస్తున్న తరుణంలో మరోమారు లాక్ డౌన్ పొడిగిస్తూ ప్రధాని మోడీ ప్రకటన చేశారు. మే 3 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కార్ , కరోనా ప్రభావం లేని గ్రీన్ జోన్లలో లాక్ డౌన్ సడలింపుపై ఈనెల 20 తర్వాత ఆలోచించనుంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే .

కూలీలకు మద్యం పోస్తూ టిక్ టాక్ వీడియోలు ... ఇద్దరు హైదరాబాద్ యువకులు జైలు పాలుకూలీలకు మద్యం పోస్తూ టిక్ టాక్ వీడియోలు ... ఇద్దరు హైదరాబాద్ యువకులు జైలు పాలు

Recommended Video

India Lockdown : Lockdown Extended Till May 3, PM Modi Speech Highlights
 లాక్ డౌన్ సమయంలో 70 సంవత్సరాల అవ్వ స్ఫూర్తి

లాక్ డౌన్ సమయంలో 70 సంవత్సరాల అవ్వ స్ఫూర్తి

ఇక కరోనా వైరస్ వల్ల పేద, దినసరి కూలీల బతుకు భారంగా మారింది. వారిని ఆదుకోవటానికి , వారికి ఆహారం అందించటానికి చాలా మంది ముందుకు వస్తున్నారు . కానీ ఒక సామాన్య మహిళ అందించిన సాయం మాత్రం చాలా స్పూర్తిదాయకంగా నిలిచింది. మంత్రి హరీష్ రావు చేత బుచ్చవ్వా నీ దాతృత్వం గొప్పది అనిపించింది. ఇంతకీ ఈ బుచ్చవ్వ ఎవరు ? ఆమె ఏమి చేసింది అన్న విషయానికి వస్తే తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన బుచ్చవ్వ అనే 70 సంవత్సరాల అవ్వ తన పొరుగు వారికి రూ. 25 వేలు సహాయం చేసింది.

 నాలుగేళ్ళు బట్టలు పిండిన కష్టాన్ని 25 వేల రూపాయలు పొరుగు వారికి సాయం చేసిన బుచ్చవ్వ

నాలుగేళ్ళు బట్టలు పిండిన కష్టాన్ని 25 వేల రూపాయలు పొరుగు వారికి సాయం చేసిన బుచ్చవ్వ

బుచ్చవ్వ బాగా డబ్బు ఉన్న కుటుంబంలో పుట్టిన సంపన్నురాలు కాదు . గత నాలుగేళ్లుగా ఊర్లో వారి బట్టలు పిండుతూ సంపాదించిన 25వేల రూపాయలను తాను ఉంటున్న వార్డులోని పేదల కష్టాలు చూసి చలించి ఆమె సహాయం చేసింది. ఆ వార్డులో ఉన్న కొన్ని కుటుంబాలకు ఇంటికి రూ. 1500 చొప్పున పంచింది. బుచ్చవ్వ ఆలోచనకు ఆమె భర్త గంగారాం కూడా బాసటగా నిలిచారు. మనమే రెక్కల కష్టంతో బతికే వాళ్ళం , మనకు ఈ సాయం చెయ్యటం అవసరమా అని ఆ జంట అనుకోలేదు . పొరుగువారికి సహాయం చేసి తమ గొప్ప మనసు చాటుకున్నారు.

బుచ్చవ్వ సహాయానికి ఫిదా అయిన మంత్రి హరీష్ రావు

బుచ్చవ్వ సహాయానికి ఫిదా అయిన మంత్రి హరీష్ రావు

ఇక ఈ విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు బుచ్చవ్వ సహాయానికి ఫిదా అయ్యారు. సాయం చెయ్యాలంటే డబ్బు ఉంటె సరిపోదు. మంచి మనసు ఉండాలి అని బుచ్చవ్వ హేసిన పనితో అందరికీ అర్ధం అయ్యింది . ఇక హరీష్ బుచ్చవ్వ గొప్పతనాన్ని పొగుడుతూ ట్విట్టర్ వేదికగా స్పందించారు . "బుచ్చవ్వ, నీ దాతృత్వం వెలకట్టలేనిది. కరోన వైరస్ దెబ్బకు కుదేలవుతున్న బిడ్డలకు నువ్వే కన్న తల్లివైనావు. వాళ్ల గోసలో భాగం పంచుకుందామనుకున్న నీ ఆరాటం ఎందరికో స్పూర్తిదాయకం. హృదయపూర్వక అభినందనలు" అంటూ హరీష్ రావు ట్వీట్ చేసారు.

డబ్బు ఉండటం ముఖ్యం కాదు బుచ్చవ్వ లాంటి మంచి మనసు ఉండటం ముఖ్యం

డబ్బు ఉండటం ముఖ్యం కాదు బుచ్చవ్వ లాంటి మంచి మనసు ఉండటం ముఖ్యం

వందల కోట్ల ధనం ఉన్నా పట్టుమని పది రూపాయలు నిరుపేదల ఆకలి బాధలు తీర్చటానికి ఖర్చు పెట్టని ప్రముఖులు ఉన్న నేటి రోజుల్లో బుచ్చవ్వ వంటి సామాన్య మహిళలు తమ ఔదార్యం చాటుకుంటున్నారు. చాలా చోట్ల సామాన్యులే సామాన్యులకు అండగా నిలబడుతున్నారు. ఆకలి బాధలు తీరుస్తున్నారు . ప్రచార ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇచ్చి అందిస్తున్న సాయం కన్నా , మంచి మనసుతో తోటి వారి కష్టాలు తీర్చటానికి బుచ్చవ్వ లా ముందుకు వచ్చి అందిస్తున్న సాయం ఎంతో గొప్పది . సహాయం ఎంత చేశాము అన్నది కాదు అసలు సహాయం చేసే మనసు ఉండటం ముఖ్యం . ఆ సహాయం అవతలి వారి కన్నీళ్లు కొంతైనా తుడిచిందా అన్నది అన్నిటికంటే ముఖ్యం. అలాంటి సహాయం చేసిన బుచ్చవ్వా . నీకు హ్యాట్సాఫ్ .

English summary
Butchavva, a 70-year-old aged woman who helped the needy in the ward where she has spent the past four years earnings. butchavva is working as laundry woman. she is washing the clothes for the past four years, was unable to see the hardships of the poor during the lockdown. Some of the families in that ward had to pay Rs. 1500 per share. Her husband, Gangaram, was also supported her for the idea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X