• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనసులేని కేంద్రం.!చెల్లించని బకాయిలు.!పల్లె,పట్టణ ప్రగతి సమీక్షలో హరీష్ రావు, ఎర్రబెల్లి ఆగ్రహం.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ముఖ్య‌మంత్రి చంద్రశేఖర్ రావు మేథోమ‌ద‌నం నుంచి పుట్టిన ప‌ల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాలు తెలంగాణ స‌మ‌గ్రాభివృద్ధికి నాంది ప‌లికాయ‌ని, ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల స్వ‌రూపం మారింద‌ని మంత్రులు హ‌రీశ్ రావు, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. అదే స్ఫూర్తితో 5వ విడ‌త ప‌ల్లె ప్ర‌గ‌తి, 4వ విడ‌త ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు. ప‌ల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంపై మంత్రులు హ‌రీశ్ రావు, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సోమ‌వారం బీఆర్‌కే భ‌వ‌న్‌లో స‌మీక్ష నిర్వ‌హించారు.

 ప‌ల్లె,ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తితో మారిన స్వ‌రూపం..అభివృద్ధి దిశ‌గా తెలంగాణ ప‌ల్లెలు,ప‌ట్ట‌ణాలన్న మంత్రులు

ప‌ల్లె,ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తితో మారిన స్వ‌రూపం..అభివృద్ధి దిశ‌గా తెలంగాణ ప‌ల్లెలు,ప‌ట్ట‌ణాలన్న మంత్రులు


రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 3 నుంచి 15 రోజుల పాటు కార్య‌క్ర‌మం ప్రారంభ‌మ‌వుతున్న నేప‌థ్యంలో గ‌తంలో నిర్వహించిన కార్యక్రమాలు, తాజాగా చేప‌ట్ట‌బోయే కార్య‌క్ర‌మాల‌పై చ‌ర్చించారు. ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల అభివృద్ధి కోసం దేశంలోనే ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ ప్ర‌భుత్వం 2019, సెప్టెంబ‌ర్ 6 నుంచి అక్టోబ‌ర్ 5 వ‌ర‌కు తొలిగా ఈ కార్య‌క్ర‌మం ప్రారంభించింద‌న్నారు. ప‌ల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో భాగంగా ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలు, వైకుంఠ‌దామాలు, పారిశుద్ధ్య ప‌నులు చేసుకోవ‌డంతో పాటు గ్రామానికి ఒక ట్రాక్ట‌ర్ ఏర్పాటు చేసుకున్న‌ట్లు మంత్రులు వివరించారు.

 నిధులు విడుద‌ల చేయాల‌ని కోరుతూ లేఖ.. కేంద్ర స్పంద‌న లేదన్న మంత్రులు

నిధులు విడుద‌ల చేయాల‌ని కోరుతూ లేఖ.. కేంద్ర స్పంద‌న లేదన్న మంత్రులు


ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ల్లెల అభివృద్ధి కోసం 8,963 కోట్ల రూపాయలు, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కోసం 2,748 కోట్ల రూపాయలు ఖ‌ర్చు చేసిన‌ట్లు తెలిపారు. మొత్తంగా 11,711 కోట్ల రూపాయలు ఖ‌ర్చు చేసిన‌ట్లు వివ‌రించారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 514.3 కోట్లు చెల్లింపులు చేసిన‌ట్లు మంత్రులు చెప్పారు. ప్ర‌స్తుతం వివిధ ద‌శ‌ల్లో చెల్లింపుల కోసం ఉన్న సుమారు 285 కోట్ల రూపాయ‌ల‌ను రాబోయే రెండు మూడు రోజుల్లో చెల్లించాల‌ని అధికారుల‌ను మంత్రులు ఆదేశించారు. ప‌ల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి ప‌థ‌కం కింద ఎటువంటి బ‌కాయిలు లేకుండా పూర్తి చెల్లింపులు చేయాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు.

 కేంద్రం నుంచి న‌యా పైసా రాలేదు. బిల్లుల చెల్లింపులు ఆగిపోతున్నాయన్న మంత్రులు

కేంద్రం నుంచి న‌యా పైసా రాలేదు. బిల్లుల చెల్లింపులు ఆగిపోతున్నాయన్న మంత్రులు


పెద్ద మొత్తంలో నిధులు ఖ‌ర్చు చేస్తూ, సమ‌గ్ర ప్ర‌ణాళిక‌తో అమ‌లు చేస్తున్న ఈ కార్య‌క్ర‌మం మంచి ఫ‌లితాల‌ను రాబ‌ట్టింద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం దేశంలో సంస‌ద్ ఆద‌ర్శ్ గ్రామీణ యోజ‌న‌లో 20 ఉత్త‌మ గ్రామాలు ఎంపిక చేస్తే, అందులో 19 తెలంగాణ‌కు చెందిన‌వి ఉండ‌టం దీనికి నిద‌ర్శ‌నం అన్నారు. హ‌రిత హారం, ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాల వ‌ల్ల రాష్ట్రంలో గ్రీన్ క‌వ‌ర్ 7.7శాతం పెరిగింద‌ని, ఆకుప‌చ్చ తెలంగాణ దిశ‌గా తెలంగాణ సాగుతుంద‌న్నారు. ఉపాధి హామి ప‌థ‌కం కింద చేప‌ట్టిన ప‌నుల‌కు గాను సుమారు రూ. 1100 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉందని, అట్టి నిధుల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని మే మొద‌టి వారంలోనే కేంద్రానికి లేఖ రాసిన‌ట్లు చెప్పారు. ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభ‌మై రెండు నెల‌లు పూర్తి కావొస్తున్న‌ప్ప‌టికీ, కేంద్రం ఉపాధి హామి కింద న‌యా పైసా విడుద‌ల చేయ‌లేదన్నారు.

 మరొక్కసారి ఢిల్లీ పయనం.. బకాయిలపై కేంద్రంపై ఒత్తిడి తేవాలన్న మంత్రులు

మరొక్కసారి ఢిల్లీ పయనం.. బకాయిలపై కేంద్రంపై ఒత్తిడి తేవాలన్న మంత్రులు


దీంతో చేసిన ప‌నుల‌కు బిల్లులు రాక వివిధ గ్రామాల స‌ర్పంచులు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు ఇబ్బంది ప‌డుతున్నారని, రెండు నెల‌లు గ‌డిచిన‌ప్ప‌టికీ కేంద్రం న‌యా పైసా విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో మ‌రొక సారి కేంద్రానికి లేఖ రాసి, ఢిల్లీ వెళ్లి సంబంధిత అధికారుల‌తో మాట్లాడాల‌ని, నిధులు విడుద‌ల చేసేలా త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పంచాయ‌తీ రాజ్ కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియాను ఆదేశించారు. కేంద్రం నిధులు విడుద‌ల చేసిన వెంట‌నే త్వ‌రిత‌గ‌తిన చెల్లింపులు చేయ‌డానికి త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌కు సూచించారు.

English summary
Minister Harish Rao said in a letter to the Center in the first week of May that the funds should be released immediately. Telangana ministers have said that the Center has not released any single paisa under the employment guarantee, even though two months have passed since the start of the financial year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X