దారుణం: మైనర్ బాలికపై హెచ్‌ఎం రేప్, పెళ్ళి, అసభ్య సందేశాలు
హైదరాబాద్: భావి తరాలకు విద్యాబుద్దులను నేర్పించి సన్మార్గంలో పెట్టాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు వక్రమార్గంలో పయనించాడు తాను పనిచేసే పాఠశాలలో పనిచేసే విద్యార్ధినిపై పలు మార్లు అత్యాచారం చేయడమే కాకుండా బాధితురాలిని వివాహం చేసుకొన్నాడు అంతేకాదు తనతో కాపురం చేయాలని పోన్లో అసభ్య పదజాలంతో దూషించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది.
తల్లిదండ్రుల తర్వాత గురువును ధైవంగా భావిస్తాం. కానీ, ఆ గురువులే విద్యార్ధులను జీవితాలను నాశనం చేస్తున్నారు. ఉపాధ్యాయులుగా విద్యార్ధులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులే వక్రమార్గంలో పయనించడం మాత్రం సభ్య సమాజం తలదించుకొనే విధంగా ఉంది.
రంగారెడ్డి జిల్లా చేవేళ్ళ మండలంలోని ఆలూరుకు చెందిన ఓ వ్యక్తి షాబాద్ మండల కేంద్రంలో నివాసం ఉంటున్నాడు. అతను ముచ్ఛింతల్‌లోని ప్రాధమికోన్నత పాఠశాలలో 2010 నుండి ప్రధానోపాద్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.

స్టూడెంట్‌పై హెచ్ ఎం అత్యాచారం
ముచ్ఛింతల్‌లోని ప్రాథమికోన్నత పాఠశాలలో 2010 నుండి అలీ అనే వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఐదేళ్ళ క్రితం అదే పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలికను పాస్ చేయిస్తానని నమ్మించి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఆ బాలిక ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆ బాలిక స్కూల్లో చదివిన సమయంలో ఫ్రధానోపాధ్యాయుడు తన కోరికను తీర్చుకొన్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

స్టూడెంట్‌ను వివాహం చేసుకొన్న ప్రధానోపాధ్యాయుడు
బాధితురాలు ఇంటర్మీడియట్ చదువుతోంది. అయితే ఆ బాలికను మరో మహిళ సహకారంతో అపహరించి గోల్కొండ కోటలోకి తీసుకెళ్ళి బలవంతంగా ప్రధానోపాధ్యాయుడు పెళ్ళి చేసుకొన్నాడని బాధితురాలి కుటుంబం ఆరోపిస్తోంది. ఇంటికి వచ్చిన బాలిక మెడలో ఉన్న పసుపు తాడును చూసిన బాధితురాలి తల్లిదండ్రులు ప్రశ్నించారు. అయితే అసలు విషయాన్ని ఆమె తేల్చి చెప్పింది.

కాపురానికి రావాలని సందేశాలు
తాళి కట్టానని కాపురానికి రావాలని బాధితురాలిని ఫోన్‌లో అసభ్య పదజాలంతో హెచ్ఎం బెదిరించాడు. ఈ సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోన్ సంభాషణలతో పాటు బాలికపై ప్రధానోపాద్యాయుడు వ్యవహరించిన తీరుపై బాధిత కుటుంబం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మంత్రి అనుచరుడిగా హెచ్ఎం
ప్రధానోపాధ్యాయుడు ఓ మంత్రి అనుచరుడిగా చెప్పుకొంటాడని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు తమకు పనులు చేయిస్తానని ఆయన చెప్పుకొనేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. అదే విధంగా సుదీర్ఘ కాలంగా ఒకే పాఠశాలలో ఆయన విధులను నిర్వహిస్తున్నాడని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ విషయమై బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications