మండుతున్న ఎండల వేళ కూల్ న్యూస్ - ఈ జిల్లాల్లో వర్షాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో ఎండల మండిపోతున్నాయి. ఇదే సమయంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. కొద్ది రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వడగాల్పులు పెరుగుతున్నాయి. ఈ రోజు (సోమవారం) ఏపీలో 202 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతా వరణ శాఖ అప్రమత్తం చేసింది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతున్నాయి. దీంతో, ఎండల సమయంలో బయటకు రావాలంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక, వర్షాల పైన వాతావరణ శాఖ కీలక సమాచారం వెల్లడించింది.

రికార్డు ఉష్ణోగ్రతలు
ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోంది. అనకాపల్లి జిల్లాలో అధికంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. నంద్యాల, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతు న్నాయి. ఇక, ఈ రోజు రాష్ట్రంలోని 202 మండలాల్లో వడగాలులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. విజయనగరంలో 15 మండలాలు, పార్వతీపురం మన్యంలో 12, శ్రీకాకుళంలో 8 మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయని పేర్కొంది.

heat-waves-alerts-for-202-mandals-in-ap-and-rains-predictions-in-telangana

ఈ మండలాలకు హెచ్చరిక
పల్నాడులో 19, తూర్పు గోదావరిలో 19, అనకాపల్లిలో 16, శ్రీకాకుళంలో 16, కాకినాడలో 15, గుంటూరులో 14, ఏలూరులో 13, క్రిష్ణాలో 10, కోనసీమలో 9, ఎన్టీఆర్ లో 8 విశాఖలో 2 మండ లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటు తెలంగాణలోనూ ఎండల తీవ్రత ఎక్కువ ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలకు తోడు పెరుగుతున్న వడగాలులు.. ఉక్కపోత ఇబ్బంది పెడుతున్నాయి. ఉదయం నుంచే తీవ్రంగా ఉంటున్న ఎండతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతో, అసవరం అయితేనే ఎండల సమయంలో బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు.

వర్షాలకు ఛాన్స్
రానున్న రెండు రోజుల్లో వడగాలులు మరింత తీవ్రతకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక, ఇదే సమయంలో వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనాగా వెల్లడించింది. రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను తగ్గే అవకాశం ఉందని భావిస్తోంది. రానున్న రెండు రోజుల్లో ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యా ల, జగిత్యాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+