హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం: భారీ వర్షం, ట్రాఫిక్ అంతరాయం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడంతో చీకటిపడినట్లయింది. మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా.. ఆ తర్వాత భారీ వర్షం కురియడంతో నగరం మొత్తం ఒక్కసారిగా చల్లబడింది.

Recommended Video

Hyderabad Roads Empty: ఒకపక్క COVID ఉధృతి మరోవైపు ఎండల తీవ్రత... రోడ్లన్నీ ఖాళీ

కర్మన్‌ఘాట్, చంపాపేట్, సరూర్‌నగర్ తోపాటు కోఠి, అబిడ్స్, బేగంబజార్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకపూల్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, టోలీచౌకి, నారాయణగూడ, హిమాయత్ నగర్, సోమాజిగూడ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, బాలాజీనగర్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, అల్వాల్, తిరుమలగిరి, ప్రగతినగర్, నిజాంపేట, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, మాదాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.

Heavy rain in hyderabad and few districts in telangana

భారీగా వర్షం పడటంతో ద్విచక్రవాహనదారులు మెట్రో పిల్లర్ల కింద వాన తగ్గేవరకు నిలిచివున్నారు. చాలా ప్రాంతాల్లో రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎండల తీవ్రత, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న నగర జీవికి.. ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది.

కాగా, హైదరాబాద్ నగర ఇవారు ప్రాంతాలతోపాటు తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లో కూడా సోమవారం మధ్యాహ్నం నుంచి వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

English summary
Heavy rain in hyderabad and few districts in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X