తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ ?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ప్రజలకు ఊహించని షాక్ ఇస్తుంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఏ రోజు ఎలా ఉంటుందో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. కాగా రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్నిప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అలానే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఈ రోజు ( జూన్ 23, 2025 ) మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో తీవ్ర వర్షాలు, ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

రేపు (జూన్ 24, 2025 ) ఈ జిల్లాలకు తోడు నిజామాబాద్ జిల్లాలో కూడా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కొనసాగిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వాతావరణ శాఖ సూచనలు..
పిడుగుల ప్రమాదం ఉన్న వేళ పొలాల్లో పనిచేయకుండా ఉండాలని రైతులకు సూచించారు.
టెంట్లు, చెట్లు, మీటల్ పైపు నిర్మాణాల వద్ద నిలుచోవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి.
విద్యుత్ స్తంభాలు, నీటిలో మునిగిన ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించారు.












Click it and Unblock the Notifications