హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ ఐసిస్: హై అలర్ట్, తనిఖీలతో జల్లెడ పడుతున్నారు (ఫోటోలు)

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో ఐసిస్ ఉగ్రవాద ఏజెంట్లు పట్టుబడటంతో హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. కాగా ఈ హై అలర్ట్ గురువారం నుంచి జులై 6వ తేదీ వరకు ఉంటుందని ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మొత్తాన్ని అక్టోపస్ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

హైద్రాబాద్‌పై ఐసిస్, ఇవే టార్గెట్: నెట్ ద్వారా బాంబు తయారీ నేర్చారు

దేశీయ, అంతర్జాతీయ టెర్మినళ్ల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయంలో కూడా అంతర్గత భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. ఎయిర్ పోర్ట్‌కు ఉన్న అన్ని ప్రధాన రహదారుల్లో పోలీసు బలగాలను మొహరించారు. సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ బలగాలతోపాటు రక్ష సెక్యూరిటీ దళాలతో భద్రతను పెంచారు.

మెయిన్ గేట్ వద్ద వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్‌లో అన్ని రకాల పాసులు రద్దు చేశారు. సందర్శకులను అనుమతిని నిరాకరించారు. బంధువులను, స్నేహితులను ఎయిర్ పోర్ట్‌లో దిగబెట్టడానికి వచ్చే వారు టికెట్‌, ఐడీ కార్డులు తెచ్చుకోవాలని ఎయిర్‌పోర్ట్ సిబ్బంది విజ్ఢప్తి చేశారు.

టెక్కీ సాయంతో హైద్రాబాద్‌లో పేలుళ్లకు ఐసిస్ ప్లాన్: ఏం జరిగింది? (పిక్చర్స్)

ఇక హైదరాబాద్ నగరంలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యమంగా షాపింగ్ మాల్స్, సినిమాహాల్స్ తదితరలాంటి చోట్ల పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మాదాపూర్ ఇన్‌ఆర్బిట్ మాల్, సైబర్‌టవర్ లాంటి ప్రదేశాల్లో గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వాహనాలను కూడా తనిఖీ చేసిన తర్వాత ఎయిర్ పోర్ట్‌లోకి అనుమతిస్తున్నారు.

ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్: సందర్శకులకు నో ఎంట్రీ

ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్: సందర్శకులకు నో ఎంట్రీ

హైదరాబాద్‌లో విధ్వంసాలకు తెగబడేందుకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) అనుబంధ సంస్థ అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్(ఏయూటీ) పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) భగ్నం చేసింది. బుధవారం తెల్లవారుజామున పాతబస్తీలోని ఎనిమిది ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 11 మంది అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్: సందర్శకులకు నో ఎంట్రీ

ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్: సందర్శకులకు నో ఎంట్రీ

సౌత్ ఇండియా ఇన్‌చార్జ్‌గా భావిస్తున్న మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ, అతని సోదరుడు మహ్మద్ ఇలియాస్ యజ్దానీ, హబీబ్ మహ్మద్, మహ్మద్ ఇర్ఫాన్ అలియాస్ యాఖస్ ఇర్ఫాన్, అబ్దుల్ బిన్ అహ్మద్ అల్‌మౌదీ అలియాస్ ఫహద్, సయ్యద్ నైమతుల్లా హుస్సేనీ అలియాస్ యాసేర్ నైమతుల్లా, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్, మహ్మద్ అతుల్లా రెహ్మాన్, అల్ జిలానీ అబ్దుల్ ఖదీర్ మోసిన్ మహ్మద్, ఏఎం అజర్, మహ్మద్ అరబ్ అహ్మద్‌లుగా గుర్తించింది.

ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్: సందర్శకులకు నో ఎంట్రీ

ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్: సందర్శకులకు నో ఎంట్రీ

పోలీసులు అరెస్టు చేసిన వారంతా 24 నుంచి 32 ఏళ్ల వయస్సు వారే. వారిలో... ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, ఆటో మొబైల్ వర్కర్లు, మెకానికల్, ఎలక్ట్రానికల్ ఇంజినీర్లు, మోటార్ మెకానిక్‌లు ఉన్నారు. హైదరాబాద్, బెంగళూరు నగరాలు టార్గెట్ గా మూడు బృందాలతో విధ్వంసానికి పాల్పడేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలిసింది. వీరు భారీ పేలుడు పదార్థాలు చేయడంలో నిపుణులుగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి పోలీసులు హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి వాటిని స్వాధీనం చేస్కున్నారు.

ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్: సందర్శకులకు నో ఎంట్రీ

ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్: సందర్శకులకు నో ఎంట్రీ

గురువారం మధ్యాహ్నం ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. వీరిని పూర్తిగా విచారించేందుకు గాను తమ కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ కోరనుంది. అవసరమైతే పీటీ వారెంటు మీద ఢిల్లీకి కూడా తీసుకెళ్లి విచారిస్తామని చెబుతున్నారు.అనుమానిత ఉగ్రవాదులకు విదేశాల నుంచి భారీగా హవాలా మార్గంలో డబ్బులు అందినట్లు ఎన్ఐఏ గుర్తించింది.

English summary
High alert at Shamshabad airport and several other sensitive places in Hyderabad has been sounded after National Investigative Agency (NIA) slueths nabbed 13 Islamic State operatives from Old City on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X