‘మర్డర్’కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ -ఎస్సీ, ఎస్టీ కోర్టు స్టే కొట్టివేత -ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ హత్యోదంతం ఆధారంగా రూపొందినట్లు భావిస్తోన్న 'మర్డర్' సినిమాకు సంబధించి తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా.. ప్రణయ్, అమృతల ప్రేమపెళ్లి, ప్రణయ్ హత్య, మారుతీరావు ఆత్మహత్య కథాంశంతో తీశారని ఆరోపిస్తూ, దాని విడుదలను నిలిపివేయాలంటూ అమృత, ప్రణయ్ తండ్రి బాలస్వామి నల్గొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై వాద ప్రతివాదనలు విన్న ఎస్సీ, ఎస్టీ కోర్టు 'మర్డర్' సినిమాపై స్టే విధించింది. కానీ..

 హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు విధించిన స్టే ఉత్తర్వులను సవాలు చేస్తూ ‘మర్డర్' చిత్ర యూనిట్ హైకోర్టును ఆశ్రయించగా, సదరు పిటిషన్‌పై విచారణ చేపట్టిన జడ్జిలు.. కింది కోర్టు ఇచ్చిన స్టేను కొట్టివేస్తూ, సినిమా విడుదలకు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే సినిమాలో అమృత, ప్రణయ్ పేర్లు ఎక్కడా వాడకూడదని హైకోర్టు షరతు విధించింది. అంతేకాదు..

సన్నివేశాలు ఉండరాదు..

సన్నివేశాలు ఉండరాదు..

‘మర్డర్' సినిమాలో అమృత ప్రణయ్ పేర్లతోపాటు, వారి నిజజీవితాలను తలపించే విధంగా సన్నివేశాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. దీనికి చిత్ర యూనిట్ అంగీకరించడంతో ‘మర్డర్' విడుదలకు అడ్డంకులు తొలగిస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. వీలైనంత త్వ

అమృత-ప్రణయ్ స్టోరీ కాదు

అమృత-ప్రణయ్ స్టోరీ కాదు

‘‘నిజ జీవిత గాథల ఆధారంగా నేను చాలా సినిమాలు తీశాను. ఎప్పుడు కూడా ఇది రియల్ స్టోరీ అని చెప్పలేదు. కొన్ని సంఘటనల ఆధారంగా నేను తయారు చేసుకున్న కథే ఈ ‘మర్డర్' సినిమా. పిల్లలు, పెద్దల ఆలోచనలకు మధ్య వుండే సెన్సిటివ్ విషయాన్ని చూపించాను. ఇవాళ్టి కోర్టు తీర్పు సంతోషం కలిగించింది. మా సినిమాలో పాత్రలకు అమృత ప్రణయ్ అనే పేర్లు పెట్టలేదు, నేనెప్పుడూ వాళ్ళ స్టొరీనే తీస్తున్నానని చెప్పనేలేదు. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా చోట్ల జరుగుతుంటాయి. ఒకరు కరెక్ట్ ఇంకొకరు రాంగ్ అని నేను చెప్పట్లేదు. ఆయా ఘటనల ఆధారంగా నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ‘మర్డర' సినిమా తీశాను''అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+