తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్‌క్లియర్: హైకోర్టు కీలక తీర్పు

తెలంగాణలో గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు లైన్ క్లియర్ అయ్యింది. అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే అక్టోబర్ 21 నుంచి గ్రూప్-1 పరీక్షలు జరగనున్నాయి.

కాగా, అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షల నిర్వహించనున్నారు. పరీక్ష హాల్‌లోకి మధ్యాహ్నం 12.30 గంటల నుంచే అభ్యర్థులను అనుమతించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు గేట్లు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు.

High Court gives green signal to conduct Group-1 Mains exams in Telangana

అభ్యర్థులకు సాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. జూన్ 9న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు 3.02 లక్షల మందికిపైగా హాజరయ్యారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత ఫలితాలను విడుదల చేశారు. కాగా, గ్రూప్ 1 మెయిన్స్‌లో మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ 3 గంటల వ్యవధిలో 150మార్కులకు నిర్వహిస్తారు.

పరీక్షల షెడ్యూల్ ఇలా..

అక్టోబర్ 21న జనరల్ ఇంగ్లీష్ (క్వాలిఫైయింగ్ ) 22న పేపర్-1 (జనరల్ ఎస్‌ఏ) 23న పేపర్-2 (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం) 24న పేపర్ -3 (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్) 25న పేపర్ -4 (ఎకానమీ, డెవలప్మెంట్) 26న పేపర్- 5 (సైన్స్ అండ్‌ టెక్నాలజీ, డేటా ఇన్టర్ప్రెటేషన్ 27న పేపర్‌-6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం)

మెయిన్స్ పరీక్షలు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. జనరల్ ఇంగ్లీష్ తప్ప, మిగిలిన పేపర్లను అభ్యర్థలు ఎంచుకున్న భాషలో రాయాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+