న‌రేంద‌ర్ రెడ్డి అరెస్ట్ తీరుపై హైకోర్టు ఆగ్రహం..!!

మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్ట్ తీరు పైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లగచర్ల ఘటన లో తనను అరెస్టు చేసి రిమాండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ నరేందర్‌రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ పై విచారణ జరిగింది. మాజీ ఎమ్మెల్యేను ఓ ఉగ్రవాది మాదిరిగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది. నరేందర్‌రెడ్డి పాత్రపై నమోదు చేసిన వాంగ్మూలాలు ఇవ్వాలని పీపీని హైకోర్టు ఆదేశించింది.

లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. త‌న‌పై న‌మోదైన కేసు కొట్టివేయాలంటూ న‌రేంద‌ర్ పిటిష‌న్ లో కోరారు. దీని పైన విచారణ చేప‌ట్టిన హైకోర్టు ధ‌ర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయ‌నేమైనా టెర్రరిస్టా అని సీరియస్ అయింది. మార్నింగ్ వాక్ లో ఉండ‌గా ఎలా అరెస్ట్ చేస్తారని ప్ర‌శ్నించింది. నరేందర్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ.. కాల్స్ చేసినందుకు అరెస్ట్ చేయడం సరికాదని, కనీసం అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు కూడా చెప్పలేదని కోర్టుకు నివేదిం చారు. సుప్రీం తీర్పులు కింది కోర్టు పరిగణలోకి తీసుకోలేదని, అరెస్ట్ గ్రౌండ్స్ చూడకుండానే నరేందర్ రెడ్డికి న్యాయస్థానం రిమాండ్ విధించిందని న్యాయవాది వివరించారు.

High court Key comments over Patnam Narender Reddy Arrest reserved the judgement

పోలీసులు కోర్టుు సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. తమకు కావాల్సిన విధంగా రాసు కొని కన్ఫెషన్ రిపోర్టుగా చూపిస్తున్నారని కోర్టుకు నివేదించారు. అదే సమయంలో కోర్టు సైతం పోలీసులకు పలు ప్రశ్నలు సంధించింది. లగచర్ల ఘటన జరిగిన రోజు సురేష్‌తో నరేంద్ర ఎన్ని సార్లు ఫోన్‌లో మాట్లాడారని అడిగింది. ఘటనా స్థలంలో పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారా అంటూ ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో ఆయన పాత్ర ఏంటని ప్రశ్నించిన న్యాయస్థానం ..పార్క్‌లో వాకింగ్ చేస్తున్న నరేందర్‌ను ఏ నిబంధనల ప్రకారం అరెస్ట్ చేశారంటూ ప్రశ్నలు సంధించింది. అతను ఏమైనా టెర్రరిస్టా అని సీరియస్ అయింది. కోర్టు ప్రశ్నలకు ప్రభుత్వ న్యాయవాది స్పందించారు.

లగచర్లలో చోటు చేసుకున్న ఘటన స్థలంలో నరేందర్ రెడ్డి లేకున్నా నిందితులకు ఆయనే డబ్బు సమకూర్చారని పేర్కొన్నారు. దాడికి పాల్పడ్డ నిందితులకు ఆయన సాయం అందిం చారని తన వాదనల్లో వివరించారు. లగచర్లలో అధికారుల పై దాడికి పరోక్షంగా ప్రేరేపించారని వాదించారు. అరెస్ట్ పైన స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసారు. నరేందర్ రెడ్డిని కేబీఆర్ పార్క్‌లో అరెస్ట్ చేయలేదని, ఆయన ఇంటి ముందు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇరు వైపులా వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం తీర్పును రిజ‌ర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+