హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళా సర్పంచ్‌ను వివస్త్రను చేసి సజీవ దహనానికీ యత్నం (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓ యువకుడి మృతి ఘటనతో మెదక్‌ జిల్లా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్‌ గ్రామం అట్టుడికిపోయింది. స్వల్ప ఘటనతో మొదలైన గొడవ... ఒకరు మృతి చెందడంతో మెదక్, కరీంనగర్ జిల్లాల్లోని రెండు గ్రామాల మధ్య యుద్ధానికి వేదికైంది.

కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల్ల గ్రామస్థులు ఇబ్రహీంపూర్‌ గ్రామ సర్పంచి ఇంటికి నిప్పుపెట్టారు. మహిళా సర్పంచిపై దాడి చేయటమే కాకుండా ఆమెను వివస్త్రను చేసి సజీవ దహనానికీ ఆందోళనకారుల్లోని మహిళలు ప్రయత్నించారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్‌ను అడ్డుకున్నారు.

అడ్డుకోబోయిన పోలీసులపైనా దాడికి దిగారు. టీవీ రిపోర్టర్‌పై దాడిచేసి కెమెరా పగులగొట్టారు. పోలీసులపైనా ప్రతాపం చూపించారు. శుక్రవారం ఆరుగంటలపాటు ఇబ్రహీంపూర్‌లో క్షణక్షణానికి ఉత్కంఠ నెలకొన్నది. దీంతో మెదక్‌, కరీంనగర్‌ జిల్లాల పోలీసులు అతి కష్టం మీద పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

వివరాల్లోకి వెళితే, కరీంనగర్‌ జిల్లా జిల్లెల్లకు చెందిన శ్రీరాం శ్రీహరి అనే బీడీ టేకేదారు (మునీం) ఇబ్రహీంపూర్‌లో బీడీ పరిశ్రమను నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య అరుణ, కొడుకు రుత్విక్, కూతురు రవయత్రి, తల్లిదండ్రులు మల్లేశం, నాగమణి, సోదరుడు సంతోష్ ఉన్నారు.

ఎప్పటిలాగే గురువారం ఉద యం 10.30 గంటల ప్రాంతంలో గంపతో ఇంటినుంచి వెళ్లిన శ్రీహరి మెదక్ జిల్లా సిద్దిపేట మండలం మాటిండ్ల, శేఖర్‌రావుపేట నుంచి ఇబ్రహీంపూర్ వెళ్లాడు. మధ్యాహ్న వేళ ఓ బంధువు శవయాత్రలో ఇబ్రహీంపూర్ సర్పంచ్ కుంబాల లక్ష్మి పాల్గొన్నారు.

మహిళా సర్పంచ్‌ను వివస్త్రను చేసి సజీవ దహనానికీ యత్నం

మహిళా సర్పంచ్‌ను వివస్త్రను చేసి సజీవ దహనానికీ యత్నం


రెండో కోడలు రేవతిని కొట్టి ఇంట్లో బంధించి నిప్పుపెట్టే ప్రయత్నంచేశారు. అదే సమయంలో చేరుకున్న సిద్దిపేట రూరల్ సీఐ ప్రసన్నకుమార్,ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ చాకచక్యంగా వారిని సురక్షిత ప్రదేశానికి తరలించారు. కోపోద్రిక్తులైన మృతుడి సంబంధీకులు సీఐ, ఎస్‌ఐలపైనా కిరోసిన్ చల్లారు. దుర్భాషాలాడి పోలీసులను నెట్టివేశారు. మీడియా కవరేజీ వెళ్లిన ఎన్‌టీవీ రిపోర్టర్ నాగరాజును రాళ్లతో కొట్టారు. వీడియో కెమెరాను ధ్వంసం చేశారు. రాజగోపాల్‌పేట ఎస్‌ఐ గోపాల్‌రావు వారిని చెదరగొట్టి నాగరాజును రక్షించారు.

మహిళా సర్పంచ్‌ను వివస్త్రను చేసి సజీవ దహనానికీ యత్నం

మహిళా సర్పంచ్‌ను వివస్త్రను చేసి సజీవ దహనానికీ యత్నం


సర్పంచ్ ఇంటికి నిప్పంటించడంతో మంటలు ఎగిసిపడి పక్కనే ఉన్న రెండు ఇండ్లకు వ్యాపించాయి. సిలిండర్లు పేలడంతో భారీ శబ్దం వచ్చింది. పోలీసు బలగాలు పూర్తిస్థాయి లో లేకపోవడంతో అదుపుచేయడం సాధ్యం కాలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మెదక్‌ జిల్లాతో పాటు కరీంనగర్‌ జిల్లా నుంచి బలగాలను రప్పించారు. అయినా శ్రీహరి మృతదేహాన్ని తరలించడానికి ఆందోళనకారులు ససేమిరా అన్నారు. శ్రీహరి మృతదేహాన్ని పోలీసులు ట్రాక్టర్‌పై తరలించడానికి యత్నించగా ఆందోళనకారులు రాళ్లు, మట్టి విసురుతూ ప్రతిఘటించారు. పోలీసులు వారిని చెదరగొట్టి మృతదేహాన్ని కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 మహిళా సర్పంచ్‌ను వివస్త్రను చేసి సజీవ దహనానికీ యత్నం

మహిళా సర్పంచ్‌ను వివస్త్రను చేసి సజీవ దహనానికీ యత్నం


దాడి ఘటనలో మృతి చెందిన బీడీ కంపెనీ యజమాని శ్రీహరి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం అతడి మృతదేహాన్ని సిరిసిల్ల మండలం జిల్లెల్లకు పోలీసులు తరలించారు. అయితే స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో జిల్లెల్ల - ఇబ్రహీంపూర్ లో పోలీస్ పికెటింగ్ కొనసాగుతుంది.

 మహిళా సర్పంచ్‌ను వివస్త్రను చేసి సజీవ దహనానికీ యత్నం

మహిళా సర్పంచ్‌ను వివస్త్రను చేసి సజీవ దహనానికీ యత్నం


అలాగే ఇబ్రహీంపూర్ సర్పంచ్ ఇంటిపై దాడి కేసులో ఇప్పటి వరకు చెర్లుమద్ది సర్పంచ్ సహా 30 మందిని సిద్ధిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐజీ నవీన్‌చంద్‌, మెదక్‌ ఎస్పీ సుమతి, కరీంనగర్‌ ఎస్పీ జుయల్‌ డెవీస్‌, ఓఎస్డీ సుబ్బారాయుడు పరిస్థితిని సమీస్తున్నారు. ఐజీ నవీన్‌చంద్‌ మాట్లాడుతూ...శ్రీహరిని కొట్టిన వారిపై సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేస్తామని, ఇబ్రహీంపూర్‌లో దాడికి పాల్పడిన ఆందోళనకారులపై సిద్దిపేటలో కేసులు పెడతామన్నారు.

అదే సమయంలో బీడీ కంపెనీకి సంబంధించిన గంపావాలా తన బైక్‌పై బీడీలున్న గంపను తీసుకెళుతుండగా ఇబ్రహీంపూర్‌లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళా సర్పంచ్‌కు తగిలింది. ఆ ద్విచక్ర వాహనదారుడు ఆగకుండా వెళ్లిపోయాడు.

విషయం తెలుసుకున్న సర్పంచి లక్ష్మి కొడుకులు కుంబాల ఎల్లారెడ్డి, నగేశ్‌రెడ్డి, స్నేహితులు కుంబాల నాగిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, రజనీకాంత్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి కలిసి గ్రామంలోని బీడీ కార్ఖానా వద్దకు వెళ్లి శ్రీహరిని నిలదీశారు. తానెవరికీ బండి తాకించలేదని, మరో గంపావాలా కూడా వెళ్లాడని చెప్పినా వినిపించుకోకుండా తీవ్రంగా కొట్టారు.

దీంతో సిరిసిల్లలో ఉంటున్న తన బావ గడ్డమీది శ్రీనివాస్‌కు శ్రీహరి ఫోన్‌చేసి చెప్పాడు. గడ్డమీది శ్రీనివాస్, నల్ల శ్రీనివాస్, నల్లరమేశ్ కారులో, మహ్మద్ గోరేమియా, విజయ్‌కుమార్‌తోపాటు మరికొందరు ఆటోలో ఇబ్రహీంపూర్‌కు వెళ్లారు. సర్పంచ్‌తోపాటు ఆమె కొడుకులను నిలదీయడంతో వారిపైనా దాడికి దిగారు.

ఆ తర్వాత శ్రీహరిని అతని మిత్రులు తీసుకెళ్లి సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఆ రాత్రికి శ్రీహరి స్వగ్రామమైన జిల్లెలకు తీసుకువెళ్లారు. శుక్రవారం ఉదయం ఏడు గంటలప్రాంతంలో శ్రీహరి నోట్లో నుంచి రక్తం కక్కుకోవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతిచెందాడు. సర్పంచ్ కొడుకుల దాడి వల్లే శ్రీహరి మృతిచెందాడని సిరిసిల్ల ఠాణాలో శ్రీహరి భార్య ఫిర్యాదుచేసింది.

శుక్రవారం వేకువ జామున శ్రీహరి మృతి చెందటంతో ఆగ్రహావేశానికి గురైన బంధు మిత్రులు.. కరీంనగర్‌ జిల్లా జిల్లెల్ల, తెర్లుమద్ది వీర్నపల్లికి చెందిన దాదాపు 400 మంది శుక్రవారం ఉదయం 8 గంటలకు ఇబ్రహీంపూర్‌కు వచ్చి మృతదేహాన్ని సర్పంచి ఇంటి సమీపంలో ఉంచి ఆందోళనకు దిగి సర్పంచి లక్ష్మి ఇంటిపై దాడికి దిగారు.

శ్రీహరి మృతదేహాన్ని సర్పంచ్ లక్ష్మి ఇంటి ముందు చౌరస్తా వద్ద ఉంచి మూడు గ్రామాల ప్రజలు బైఠాయించారు. అప్పటికే కోపోద్రిక్తులైన యువకులు సర్పంచ్ ఇంట్లోకి వెళ్లి వస్తువులను ధ్వంసం చేశారు. కిరోసిన్, పెట్రోల్ చల్లి పెంకుటిల్లుకు నిప్పుపెట్టారు. ఆందోళనకారుల్లోని మహిళలు సర్పంచిని వివస్త్రచేసి తీవ్రంగా కొట్టారు.

English summary
High Tension in Ibrahimpur Medak District in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X