వాహనదారుల పెండింగ్ చలాన్లపై హైకోర్టు బిగ్ రిలీఫ్.. ట్రాఫిక్ పోలీసులకు షాక్!
తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపైన కఠిన చర్యలు తీసుకోమని ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేస్తూ చలాన్ల చెల్లింపులో రాయితీలు ఉండవని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ట్రాఫిక్ ఈ చలాన్ లను ఆటో డెబిట్ చేసే ప్రతిపాదనను కూడా సీఎం రేవంత్ రెడ్డి చేయడం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి విమర్శలకు కారణమైంది.
వాహనదారులకు భారీ ఊరట కల్పించిన హైకోర్టు
ఇదే సమయంలో తాజాగా వాహనదారులకు రాష్ట్ర హైకోర్టు భారీ ఊరట కల్పించింది. పెండింగ్ చలాన్ల వసూలు విషయంలో కీలక తీర్పును వెల్లడించింది. న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఈ కీలక ఆదేశాలను జారీ చేసింది. రోడ్లపైన పోలీసులు బలవంతపు చలాన్ల వసూళ్లను చేయరాదని, వాహనాల కీలు లాక్కోవడాన్ని హైకోర్టు నిషేధించింది.

ట్రాఫిక్ పోలీసుల చలాన్ల వసూళ్ళపై ఫిర్యాదులతో హైకోర్టు కీలక తీర్పు
బకాయిలను కచ్చితంగా చట్టపరమైన పద్ధతిలోనే వసూలు చేసుకోవాలని స్పష్టం చేసింది. చలాన్ల పేరుతో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్న క్రమంలో వారిపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో న్యాయస్థానం కీలక ఆదేశాలను ఇచ్చింది. ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టిన సమయంలో బలవంతంగా చలాన్లు వసూలు చేయడం, వాహనాల కీలను లాక్కోవడం, వాహనాలను అక్కడే నిలిపి ట్రాఫిక్ ఆటంకం కలిగించడం వంటి వాటిపైన ఫిర్యాదులతో హైకోర్టు ఈ కీలకతీర్పును ఇచ్చింది.
బలవంతంగా వసూళ్లు చేయరాదన్న హైకోర్టు
బలవంతంగా చలాన్లు వసూలు చేయకూడదని పేర్కొంది. రోడ్లపైన ట్రాఫిక్ నిలిపి ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదని వెల్లడించింది. పోలీసుల విధులు నిబంధనలను పర్యవేక్షించడమేనని, వసూళ్ల కోసం వాహనదారులను వేధించడం చట్ట విరుద్ధమని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. వాహనదారులు స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే చలాన్లు తీసుకోవాలని, బలవంతంగా చెల్లించేలా చేయకూడదని హైకోర్టు స్పష్టం చేసింది.
కోర్టు నుండి నోటీసులు పంపాలని సూచించిన కోర్టు
ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలాన్ల వసూళ్లకు చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాలి కానీ, బలవంతపు వసూళ్లు చేయడం మంచిది కాదని పేర్కొంది. చట్టబద్ధంగా కోర్టు నుంచి నోటీసులు పంపాలని ఆదేశించింది. నేరుగా రోడ్ల పైన వసూళ్లు చేయడం సరికాదని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది
-
మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications